Business

ఈ దేశంలో విమాన టిక్కెట్ల కంటే రైలు ఛార్జీలు ఖరీదైనవి

ఈ దేశంలో విమాన టిక్కెట్ల కంటే రైలు ఛార్జీలు ఖరీదైనవి

యూరోపియన్ దేశాల్లో రైలు ఛార్జీలు విమాన టిక్కెట్ల కంటే 30 రెట్లు ఖరీదైనవని ఎన్ర్విరాన్ మెంటల్ గ్రూప్ చేసిన సర్వేలో తేలింది. గ్రీన్‌పీస్ నిర్వహించిన ఈ అధ్యయనంలో..  రైళ్లు, విమానాలలో టిక్కెట్ ధరను పోల్చి చూపిస్తూ వివరాలను వెల్లడించింది. అందులో భాగంగా 112 మార్గాల్లో రైలు ఛార్జీలు.. విమాన టిక్కెట్‌ల కంటే దాదాపు రెట్టింపుగా ఉన్నట్టు తెలిపింది. కొన్ని సందర్భాల్లో ఇవి 4 రెట్లు అధికంగా కూడా ఉన్నాయని వెల్లడించింది.

ప్రఖ్యాత యూరోస్టార్‌లో యూకే నుంచి యూరప్‌కు వెళ్లే రైలు టిక్కెట్ల ధర ఫ్లైట్ టికెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని తేలింది. స్పెయిన్‌లో విమాన టిక్కెట్లు 71 శాతం రూట్లలో తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం, యూకే, బెల్జియం, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ విమానాలతో పోలిస్తే అత్యంత ఖరీదైన రైలు టిక్కెట్లను కలిగి ఉన్నాయి.లండన్ నుంచి బార్సిలోనాకు చివరి నిమిషంలో బుక్ చేస్తే విమాన టిక్కెట్లతో పోలిస్తే టిక్కెట్ల ధరలు దాదాపు 29.6 రెట్లు పెరిగాయని ఈ అధ్యయనం ఓ నివేదికలో తెలిపింది.