భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ షార్ నుంచి ఈనెల 14న ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్‌కు ఈనెల 25న అయిదోసారి కక్ష్య దూరాన్ని పెంచనున్నారు. బెంగళూరులోని ఇ్రస్టాక్ కేంద్రం శాస్త్రవేత్తలు 25న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో ఈ ఆపరేషన్ చేపట్టనున్నారు.భూమికి సంబంధించిన కక్ష్యలో ఆఖరిసారిగా చేపట్టే ఆపరేషన్‌తో చంద్రయాన్–3 భూమి నుంచి విశ్వంలో చంద్రుడ్ని చేరుకునే దిశగా ప్రయాణిస్తుంది. ఆగస్ట్ 1 నాటికి చంద్రయాన్–3 లూనార్ ఆర్బిట్ (చంద్ర కక్ష్య)కు చేరుకుంటుంది. అక్క డ నుంచి 17 రోజుల పాటు చంద్రుడి చుట్టూ పరి్రభమిస్తూ ఆగస్ట్ 23న చంద్రునికి 30 కిలోమీటర్ల ఎత్తులో ప్రపొల్షన్ మాడ్యూల్ ల్యాండర్‌ను విడిచి పెడుతుంది. అదే రోజు సాయంత్రం ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది.