* మద్యం మత్తులో బార్‌కు నిప్పు
మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన పని 11 మంది ప్రాణాలను బలిగొంది. మెక్సికోలోని సోనోరా (Sonora) రాష్ట్రంలోని శాన్ లూయిస్ రియో కొలరాడో (San Luis Rio Colorado) నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్‌కు వెళ్లిన ఓ వ్యక్తి పీకలదాకా మద్యం తాగాడు. అనంతరం బార్‌లోని మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో.. బార్ భద్రతా సిబ్బంది అతన్ని బయటకు పంపించారు. ఇదే క్రమంలో అతను కొద్దిసేపు సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడు. ఆ తర్వాత అక్కణ్నుంచి వెళ్లిపోయాడు.కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి బార్‌పై పెట్రోల్ బాంబుతో దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా బార్‌లో మంటలు వ్యాపించాయి. బయటకి వెళ్లేందుకు ఒక్కటే దారి ఉండటంతో బాధితులు లోపల చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు సహా 11 మంది మృతి చెందడంతోపాటు, పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో.. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
* లంచం తీసుకొని దొంగలను వదిలిపెడుతున్నారు
ఓ పోలీసు.. తన సహోద్యోగుల అవినీతికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. హైవే రోడ్డుపై పడ్డుకొని తన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటన పంజాబ్ లోని జలంధర్ లో చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించిన అసాధారణ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నిరసన తెలిపిన పోలీసు భోగ్ పూర్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నాడు. అయితే అతడు కొంత కాలం కిందట కేసులో దొంగను అదుపులోకి తీసుకున్నాడు. స్టేషన్ కు తీసుకెళ్లి, సెల్ లో ఉంచాడు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ నిందితుడు కనిపించకుండా పోయాడు. ఆ దొంగ ఎక్కడికి వెళ్లాడని ఆ పోలీసు ఇతర పోలీసులను అడిగాడు. దీంతో వారు పొంతన లేని సమాధానాలు ఇచ్చారు.దీంతో లంచం తీసుకొని మిగితా పోలీసులు ఆ దొంగను వదిలిపెట్టారని ఆరోపిస్తూ ఆ పోలీసు జలంధర్ లోని పఠాన్ కోట్ హైవేపై వచ్చి నిరసన తెలిపాడు. హైవేను తాడుతో దిగ్బంధించారు. రోడ్డుపై అడ్డంగా పడుకున్నాడు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో భోగ్ పూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ సుఖ్ జిత్ సింగ్ అక్కడి చేరుకున్నారు. నిరసన ఆపేసి, ట్రాఫిక్ క్లియర్ చేయాలని అతడిని ఆదేశించారు. కానీ అతడు వినకపోవడంతో ఒక సారి కాలుతో తన్నడం కూడా వీడియోలో కనిపిస్తోంది. ఈ సందర్భంగా నిరసన తెలిపే పోలీసు ‘‘నేను దొంగలను పట్టుకుంటాను. కానీ నా పోలీస్ స్టేషన్ లోని ఇతర పోలీసులు డబ్బులు తీసుకొని వారిని విడిచిపెడుతారు’’ అని ఆరోపించాడు. అయితే దీనిని అక్కడున్న వారు తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది ఇప్పుడు వైరల్ గా మారాయి.
* బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం
బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది.. శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులో బోళ్తా పడింది.. ఈ ఘోర ప్రమాదంలో ఈ ప్రమాదంలో 18మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, 8 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.. డ్రైవర్ అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.ఇక ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 65 మంది ప్రయాణిస్తున్నారు.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, 8 మంది మహిళలు ఉన్నట్లు పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ గౌతమ్ కుమార్ ఘోష్ తెలిపారు. 35 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారన్నారు.. అసలు వివరాల్లోకి వెళితే.. ఝలకతి సదర్ ఉపజిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భండారియా ఉపజిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు వెళ్తున్న ఈ బస్సు స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం వద్ద ఎదురుగా వస్తున్న ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా అదుపుతప్పి చెరువులో పడిపోయింది. బస్సులో 65 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం..
* చాక్లెట్ల దొంగకు 18 నెలల జైలు శిక్ష
చాక్లెట్లు దొంగతనం చేసినందుకు ఓ వ్యక్తికి న్యాయస్థానం 18 నెలల జైలుశిక్ష విధించింది. అదేంటి ఆమాత్రం దానికి అంత పెద్దశిక్ష ఏంటి అనుకుంటున్నారా? ఆ వ్యక్తి దొంగిలించినవి ఒకట్రెండు కాదు.. ఏకంగా 2 లక్షల చాక్లెట్లు వాటి విలువ దాదాపు రూ.42 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ఘటన బ్రిటన్‌లో జరిగింది.
* నెహ్రూ జూలాజికల్ పార్కులో దొంగలు పడ్డారు
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్పార్కులో రెండు రోజుల క్రితం దొంగలు పడ్డారు. వీరు ఎత్తుకెళ్లింది జంతువులని అనుకుంటున్నారా..? కాదు.. కాదు.. గంధపు చెట్లను. పుష్ప స్టైల్‌లో ఏడు గంధపు చెట్ల నరికేసి.. చిన్న చిన్న దుంగలుగా చేసి.. జూపార్క్ దాటించేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి అక్కడ పెరుగుతున్నది గంధపు చెట్లని చాలామందికి తెలియదు. ఈ విషయం చాలా సీక్రెట్‌గా ఉంచారు అధికారులు. కానీ.. పుష్ప గాళ్లు కనిపెడతారుగా.. అదే జరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏడు చెట్లను నరికేసుకెళ్లిపోయారు. ఇది ఒక్కరోజులో జరిగింది కాదు. చెట్లు నరికిన విధానం చూస్తే.. కొన్ని రోజులుగా స్మగ్లింగ్ జరుగుతన్నట్లు తేల్చారు అధికారులు. జూపార్క్‌లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ స్మగ్లింగ్ వెనుక ఎవరున్నారు? ఈనెల 20వ తేదీన ఈ విషయం బయటపడింది. అప్పటి నుంచి నిఘాపెట్టారు అధికారులు. కొన్ని దుంగలను అక్కడే కట్టలుగా ఉంచారు. వాటిని ఎవరైనా స్మగ్లింగ్ చేయడానికి వస్తారా అన్న కోణంలో నిఘా పెట్టారు. కాని మూడు రోజులైనా ఎవరూ రాకపోవడంతో.. జూపార్క్ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు. పార్కుకు రెండు వైపులా ఎంట్రన్స్ ఉండడం …. ఆ రెండు ఎంట్రన్స్‌లో ఏర్పాటు చేసిన సి.సి కెమెరాలను పరిశీలించినా ఆ గేట్ల గుండా గంధపు దుంగలను తీసుకెళ్లడం లాంటి దృశ్యాలు కనిపించలేదు. అంతేగాకుండా నరికిన ఏడు గంధపు చెట్లనుంచి కొన్ని దుంగలు కనిపించకుండా పోయినా.. అవి ఎలా తస్కరించారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఇది ఇంటి దొంగల పనే అని అనుమానిస్తున్నారు. 6 ఏళ్లలో ఐదు సార్లు స్మగ్లర్లు ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒక్కరు కూడా పట్టుబడక పోవడం విశేషం.
* యువతిని ర్యాపిడో బైక్ ఎక్కించుకుని దారి మధ్యలో డ్రైవర్ హస్తప్రయోగం
బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ జుగుప్సాకరమైన పనికి పాల్పడ్డాడు. డ్రైవింగ్ చేస్తూనే మహిళా ప్యాసింజర్ ఎదుట హస్తం ప్రయోగం చేశాడు. ఈ సంఘటన గురించి ఆ యువతి సోషల్ మీడియా వేదికగా బయట పెట్టింది. దీంతో పాటు బైక్ నడుపుతూ హస్తప్రయోగం చేశాడని, గమ్యస్థానంలో దించిన తర్వాత తనను వాట్సాప్‌లో వేధించాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో అతడిని బెంగళూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతిరా పురుషోత్తమన్ జులై 21న ట్విట్టర్‌లో తన కష్టాలను పంచుకున్నారు. బెంగళూరులోని టౌన్ హాల్‌లో మణిపూర్ హింసాకాండకు నిరసనగా తాను వెళ్లానని, వేదిక నుండి ఇంటికి వెళ్లడానికి ఆన్‌లైన్ యాప్‌లో ఆటోను బుక్ చేసుకున్నానని చెప్పారు. అయితే అనేక సార్లు రైడ్ రద్దు కావడంతో ఆమె బైక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది.
* కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నం
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి.. కన్న కూతురిపై కన్నేశాడు. 12 ఏళ్ల ప్రాయంలోనే అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తండ్రి.. ఆమెను కామంతో చూశాడు. కన్న కూతురిని మతపరమైన క్రతువులు చేయాల్సి ఉన్నదని మాయమాటలు చెప్పాడు. ఓ కొండ ప్రాంతానికి వెళ్లాలని బయల్దేరాడు. తండ్రి చెప్పాక మరో ఆలోచన ఏం ఉంటుందని బిడ్డ వెంటే ప్రయాణించింది. అక్కడికి వెళ్లాకే తండ్రి అసలు రాక్షసరూపం బయటపడింది.కర్ణాటకలో దేవనాగరి జిల్లాలోని మాలెబెన్నూర్‌లో హరిహర్ తాలూకాలో తండ్రి తాను కన్న కూతురిని చెరచాలని అనుకున్నాడు. కొండ ప్రాంతాల్లో మతపరమైన క్రతువులు చేయాల్సి ఉన్నదని తీసుకుని వెళ్లాడు. కొండ పైకి తీసుకెళ్లాడు. ఎవరూ లేనిది చూసి బిడ్డపై అత్యాచారానికి ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న కూతురు ప్రతిఘటించింది. అక్కడి నుంచి తప్పించుకుని వేగంగా కొండ దిగేసింది. ఆ బాలిక స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు. పోలీసులు ఆ నిందితుడిని అరెస్టు చేశారు.
* సీబీఐ ఫైనల్ ఛార్జిషీట్‌పై వైర్ వెబ్‌సైట్ సంచలన కథనం
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్యోదంతంపై సీబీఐ ఫైనల్ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 259 మంది సాక్షుల అభిప్రాయాలను సేకరించింది. వివేకా హత్యకు రాజకీయ కారణాలు, కుటుంబ విభేదాలే కారణమని చెప్పింది. అయితే వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ చాలా అంశాలను వదిలేసిందని ద వైర్ వెబ్‌సైట్ చెబుతోంది..అవేంటో ఇప్పుడు చూద్దాం..వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.. ఏపీలో సంచలనం రేపుతోంది..ఈ ఉదంతంపై అధికార ప్రతిపక్షాల మధ్య ఎన్నో ఆరోపణలు, ఎన్నో మాటల యుద్ధాలు జరిగాయి.. ఇలాంటి పరిస్థితుల్లో..సీబీఐ ఫైనల్ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసింది. అయితే అందులో చాలా అంశాలు మిస్సయ్యాయని..సంచలన కథనాన్ని ప్రచురించింది ద వైర్ వెబ్‌సైట్..
* రిజర్వ్ బ్యాంకు ఉద్యోగాల పేరుతో మోసం
రిజర్వ్ బ్యాంకు ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న ముఠాలోని ఇద్దరు సభ్యులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంజీవయ్య ఎలియాస్ జీవయ్య, ఫిరోజ్ సులేమాన్, కిరణ్ లు స్నేహితులు. తేలికగా డబ్బు సంపాదించేందుకు ముగ్గురు కలిసి రిజర్వ్ బ్యాంకులో కొంతమంది అధికారులతో తమకు పరిచయాలు ఉన్నాయని ప్రచారం చేసుకున్నారు. తమకు ఉన్న పరిచయాలతో అటెండర్, క్లర్క్ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పుకున్నారు. వీరి మాటలు నమ్మిన భార్గవి, శశిరేఖతో పాటు మరో అయిదుగురు తమకు ఉద్యోగాలు ఇప్పించాలని అడిగారు.ఈ క్రమంలో వీరి నుంచి ఎనిమిది లక్షల రూపాయలు తీసుకున్న నిందితులు నకిలీ నియామక ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని తీసుకుని రిజర్వ్ బ్యాంకుకు వెళ్లగా లబోదిబోమంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సంజీవయ్య,ఫిరోజ్ సులేమాన్లను అరెస్టు చేశారు. కిరణ్ పరారీలో ఉన్నాడు. అరెస్టు చేసిన నిందితులు ఇద్దరిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం చాదర్ ఘాట్ పోలీసులకు అప్పగించారు.
* మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్
రాజస్థాన్‌లో ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది. ముగ్గురు వ్యక్తులు ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి ఆమెను ఎత్తుకెళ్లి, జ్యూస్‌లో మత్తు మంది కలిపి, ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆపై ఆమెని ఒక చోట వదిలేసి, ఆ దుర్మార్గులు వెళ్లిపోయారు. బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు చెప్పగా.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.బార్మర్ జిల్లా శివ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఇంట్లో ఈ బాలిక ఒంటరిగా ఉండటాన్ని గుర్తించిన ముగ్గురు యువకులు.. ఏదో సాకుతో ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి, తమ కారులో కూర్చోబెట్టుకున్నారు. ఆమెకు మత్తు మందు కలిపిన జ్యూస్ ఇచ్చారు. అది తాగిన తర్వాత ఆ బాలిక అపస్మారక స్థితిలో వెళ్లిపోయింది. అప్పుడు ఆ ముగ్గురు యువకులు ఆమెను జైనారాయణ్ వ్యాస్ యూనివర్శిటీ క్రీడా మైదానానికి తీసుకెళ్లారు. ఎవ్వరూ సంచరించిన ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక అపస్మారక స్థితిలో ఉండటం వల్ల.. వారిని ప్రతిఘటించలేకపోయింది. అత్యాచారం చేసిన తర్వాత.. ముగ్గురు యువకులు ఆ బాలికని ఒక ప్రాంతంలో పడేసి, కారులో పారిపోయారు.