Politics

రేపు పార్లమెంట్ వెలుపల విపక్షాల నిరసన

రేపు పార్లమెంట్ వెలుపల విపక్షాల నిరసన

మణిపూర్‌ హింసాకాండపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంటులో చర్చ జరగకుండా ప్రతిష్టంభన నెలకొనడంతో సభ వెలుపల నిరసనల ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించాయి. సోమవారం పార్లమెంటు ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగనున్నాయి.

ఈ మేరకు ఇండియా కూటమికి చెందిన పార్టీల ఎంపీలు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో సభలో అనుసరించే వ్యూహాలపై చర్చిస్తారు. సభ లోపలికి వెళ్లడానికి ముందు ప్రధాని ప్రకటనపై డిమాండ్‌ చేస్తూ మహాత్మగాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగనున్నారు. మరోవైపు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే మణిపూర్‌ అంశంలో చర్చ లేవెనెత్తాలని టీఎంసీ డిమాండ్‌ చేసింది. బీజేపీ సభ్యులే సభాకార్యక్రమాలను అడ్డుకుంటున్నారని టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒ బ్రియన్‌ మండిపడ్డారు.ఆ రాష్ట్రాలపై పెదవి విప్పరెందుకు: బీజేపీ…ప్రతిపక్ష పారీ్టలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహిళలపై అకృత్యాలు జరుగుతున్నా ఎవరూ నోరు ఎందుకు మెదపడం లేదని బీజేపీ ప్రశ్నించింది. రాజస్తాన్, పశి్చమ బెంగాల్, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో మహిళలపై నేరాలు, ఘోరాలు జరుగుతూ ఉంటే, మణిపూర్‌ చుట్టూ ప్రతిపక్ష పారీ్టలు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆరోపించారు.