DailyDose

ట్విట్టర్ ఏది ఉచితంగా ఇవ్వదు-TNI నేటి వాణిజ్య వార్తలు

ట్విట్టర్ ఏది ఉచితంగా ఇవ్వదు-TNI నేటి వాణిజ్య వార్తలు

*  విమానాలను ఆధునీకరిస్తున్న ఎయిరిండియా

విమానాలను ఆధునీకరించేందుకు ఎయిరిండియా సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలోగా మూడో వంతు పెద్ద విమానాలను ఆధునీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విమానాల్లో అధునాతన సీట్లు అమర్చడంతో పాటు ఇన్ట్ ఎంటర్టైన్మెంట్ వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 124 విమానాలుండగా, ఇందులో 50 పెద్ద విమానాలున్నాయి.

 ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూడ్ ను కేంద్రం ప్రభుత్వం చెప్పింది.. కరువు భత్యం పెంపు బహుమతిని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మొన్నీమధ్య జీతాలను పెంచిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి పెంపు పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ని ఎంత శాతం పెంచాలనేది నిర్ణయించనున్నారు. అయితే, ఇప్పటి వరకు డియర్‌నెస్ అలవెన్స్‌లో 4 శాతం పెంపు ఉండొచ్చని ఏఐసీపీఐ గణాంకాలు చెబుతున్నాయి… ప్రస్తుతం జూలై తర్వాత డీఏ పెంచినట్లయితే, అప్పుడు డియర్‌నెస్ అలవెన్స్ 46 శాతానికి పెరగవచ్చు. ఎందుకంటే ఇది 4 శాతం డీఏ పెరుగుతుంది.ఇకపోతే జూన్‌ కు సంబంధించిన గణాంకాలు జూలై 31 న విడుదల కానున్నాయి. ఆ తర్వాత డీఏ ఎంత శాతం పెరుగుతుందనేది మరింత స్పష్టమవుతుంది. జూలైలో 4 శాతం డీఏ పెంపు ఉంటుందని, ఆ తర్వాత ఉద్యోగుల డీఏ 46 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.. ఈ నెల ఒకటి నుంచి రెండోసారి ఢీఏ పెంపు పై కీలక ప్రకటన వచ్చేసినప్పటికి, వచ్చే ఎన్నికలకు ముందు, రక్షా బంధన్‌ నుంచి దీపావళి మధ్య ఎప్పుడైనా కరువు భత్యాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.అసలు జీతం ఎలా పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం.. ఒక ఉద్యోగి మూల వేతనం రూ.18000 అయితే, దానిపై 42% డీఏ విధిస్తారు. అంటే డియర్‌నెస్ అలవెన్స్ రూ.7560. మరోవైపు, 46 శాతం డియర్‌నెస్ అలవెన్స్ కలిపితే, అది నెలకు రూ.8280 అవుతుంది. దీని ప్రకారం ప్రతి నెలా రూ.720 పెరుగుతుంది. అంటే ఏటా రూ.8 వేలకు పైగా పెరుగుదల ఉంటుంది.. అంటే ఉద్యోగులకు ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు జీతాలను పెంచుతున్నారు.. ఈ ఏడాది కూడా ఇది రెండోసారి జీతం పెరగనుంది.. 8 పే కమీషన్ గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది

టెస్లాకు ప్రత్యేక విధానాలేమీ లేవని స్పష్టం చేసిన కేంద్రం

దేశీయంగా ఈవీ కార్ల తయారీకి సంబంధించి టెస్లా కంపెనీకి ప్రోత్సాహకాలందించేందుకు ఎలాంటి ప్రత్యేక విధానాలను రూపొందించడంలేదని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆటో అండ్ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్(ఏసీసీ) కోసం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) ప్రోత్సాహకాలను పొందడానికి కంపీఎ దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏసీసీ బ్యాటరీ స్టోరేజీ కోసం రూ. 18,100 కోట్లను, ఆటో, ఆటో విడిభాగాలు, డ్రోన్ పరిశ్రమల కోసం రూ. 26,058 కోట్ల పీఎల్ఐని రూపొందించింది. పీఎల్ఐ పథకం నుంచి ప్రయోజనాలు పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చని టెస్లాకు తెలియజేశాం. భారత ప్రభుత్వ విధివిధానాలు అందరికీ ఒకేలా ఉంటాయని, ఏదైనా ఒక కంపెనీకి ప్రత్యేకంగా విధానాలను రూపొందించడం అంటూ ఉండదని అధికారి వివరించారు. టెస్లా బ్యాటరీ సరఫరాదారుగా ఉన్న పానాసోనిక్ కేంద్రాన్ని సంప్రదించిందని, ఏసీసీ బ్యాటరీల కోసం పీఎల్ఐ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్టు ఆయన వెల్లడించారు.

దేశీయ మార్కెట్లోకి మరో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు

మన దేశంలో కూడా లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో అంతర్జాతీయ బ్రాండ్లు కూడా ఇక్కడ తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. వీటిల్లో ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉంటున్నాయి. ప్రముఖ అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఫిస్కర్ ఐఎన్సీ భారతదేశంలో ఫిస్కర్ ఓషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తోంది. గతేడాదే దీనికి సంబంధించి ఓ ప్రకటన చేసింది. మన హైదరాబాద్ లో ఓ యూనిట్ ను కూడా ప్రారంభించింది. అయితే మొదటిగా 100 యూనిట్ల మేర పరిమిత విజ్ఞాన్ ఎడిషన్ ఫిస్కర్ ఓషన్ ఎస్‌యూవీని అందుబాటులో ఉంచేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పేరును మొట్టమొదటి ఇండియా అవుట్ పోస్ట్ నుంచి స్వీకరించారు. ఈ ఫిస్కర్ ఓషన్ లగ్జరీ కారు సింగిల్ చార్జ్ పై ఏకంగా 707 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

ఏపీ కన్నా TSలోనే డ్రైవింగ్ లైసెన్సులు ఎక్కువ

తెలంగాణలో 2020 మార్చి 31 నాటికి 90.98 లక్షల మంది డ్రైవింగ్ లైసెన్స్లు కలిగి ఉన్నారని కేంద్ర 2019-20 వార్షిక నివేదిక పేర్కొంది. వీరిలో 6.90శాతం మహిళలు ఉన్నారని తెలిపింది. ఏపీలో 77.37 లక్షల మందికి లైసెన్సులు జారీ కాగా.. వారిలో 96.07% పురుషులు, 3.93% మహిళలు ఉన్నారని పేర్కొంది. ఏపీతో పోలిస్తే TSలో 13.61 లక్షల డ్రైవింగ్ లైసెన్స్లు అధికంగా ఉన్నాయి. మహిళా డ్రైవర్లు TSలో 1,034, ఏపీలో 1,251 మంది ఉన్నారు.

మైనారిటీలకు లక్ష ఆర్థికసాయం

రాష్ట్రంలో బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందివ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారదోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు

*  5 కోట్లు గెలిచి …58 కోట్లు పోగొట్టుకున్నాడు

ఆన్‌లైన్ జూదానికి బానిసైన నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారి అదృష్టం ఒక్కసారిగా తలకిందులైంది. ఆన్‌లైన్ జూదానికి బానిసైన అతను ఆన్‌లైన్‌ గ్యామ్లింగ్‌లో రూ.5 కోట్ల రూపాయలు గెల్చుకున్నాడు. అత్యాశకు పోయి మళ్లీమళ్లీ ఆడి ఏకంగా రూ.58 కోట్లు పోగొట్టుకున్నాడు. ఆన్‌లైన్ మోసగాడి ఉచ్చులో చిక్కుకున్న ఈ వ్యాపారి ఉన్న డబ్బంత పోగొట్టుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారికి అనంత్ అలియాస్ నవరతన్ జైన్ అనే అన్‌లైన్ బుకీతో పరిచయమైంది. వాట్సాప్ లింకుల ద్వారా జైన్ గ్యాబ్లింగ్ నడిపించేవాడు. వ్యాపారి మొదట రూ. 8 లక్షలు డిపాజిట్ చేసి చిన్నచిన్న మొత్తాల్లో పందెం కాశాడు. వేలు పెడితే లక్షలు, లక్ష పెడితే రూ.8 లక్షలు వచ్చాయి. ఇలా జూదంలో మొత్తం రూ. 5 కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత అత్యాశతో అతను పందెం కాసేకొద్దీ ఓడిపోవడం ప్రారంభించాడు. ఇలా మొత్తం రూ. 58 కోట్లు పోగొట్టుకున్నాడు. తన డబ్బు తిరిగి ఇవ్వమని జైన్‌ కోరగా అతను నిరాకరించాడు.దీంతో తాను మోసపోయిన సంగతి తెలుసుకున్న వ్యాపారి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జైన్ వివరాలు ఆరా తీసి అతని ఇంటిపై పోలీసులు గోండియాలోని అతని నివాసంపై ఆకస్మిక దాడి చేశారు. ఐతే నిందితుడు అప్పటికే పరారయ్యాడు. జైన్ ఇంట్లో రూ.14 కోట్ల నగదు, 4 కేజీల బంగారు బిస్కెట్లతోపాటు ఇతర డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు జైన్ ముంబై నుంచి దుబాయ్‌కి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

18 శాతం క్షీణించిన బడ్జెట్ ధరల ఇళ్ల అమ్మకాలు

దేశవ్యాప్తంగా బడ్జెట్ ధరల ఇళ్లకు గిరాకీ క్షీణించింది. తక్కువ నిర్మాణాలు అందుబాటులో ఉండటం, ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం వంటి కారణాలతో ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య ప్రధాన ఏడు నగరాల్లో రూ. 40 లక్షల కంటే తక్కువ ధరలో ఉన్న సరసమైన ఇళ్ల అమ్మకాలు 18 శాతం క్షీణించి 46,650 యూనిట్లకు చేరుకున్నాయని అనరాక్ తెలిపింది. గతేడాది ప్రథమార్థంలో ఈ విభాగం ఇళ్ల విక్రయాలు 57,060 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ అనరాక్ తాజా నివేదిక ప్రకారం, సమీక్షించిన కాలంలో అమ్ముడైన మొత్తం ఇళ్లలో బడ్జెట్ ధరల ఇళ్ల వాటా 31 శాతం నుంచి 20 శాతానికి పడిపోయింది.జనవరి-జూన్ మధ్య మొత్తం ఇళ్ల అమ్మకాలు 2,28,860 యూనిట్లకు పెరిగాయి. కరోనా మహమ్మారి వల్ల మెరుగైన, సౌకర్యవంతమైన ఇళ్లను కోరుకునే వినియోగదారులు పెరగడం వల్ల బడ్జెట్ ఇళ్లకు గిరాకీ తగ్గిందని అనరాక్ ఛైర్మన్ అనుజ్ పూరి చెప్పారు. ఇదే సమయంలో భూముల ధరలు కూడా గణనీయంగా పెరిగాయని ఆయన తెలిపారు. తక్కువ మార్జిన్ బడ్జెట్ ఇంటిని నిర్మించేందుకు డెవలపర్లు ఎక్కువ ధరలకు భూమిని కొనాల్సి వస్తోందన్నారు. అలాగే, గత కొన్నేళ్లలొ ఇతర ఇన్‌పుట్ ఖర్చులు కూడా అనూహ్యంగా పెరిగాయి. ఈ పరిణామాల వల్ల సరసమైన ఇళ్ల విభాగం వృద్ధి నెమ్మదించిందని అనుజ్ పూరి వివరించారు.

* ట్విట్టర్ ఏది ఉచితంగా ఇవ్వదు

ట్విట్టర్ తమ యూజర్లకు షాక్స్ మీద షాకులిస్తోంది. కొత్త రూల్స్ పేరుతో ట్విట్టర్ యూజర్ల నుంచి అందినకాడికి డబ్బులను దండుకోవడానికి చూస్తోంది. ఇటీవలే, బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ పొందాలంటే డబ్బులు చెల్లించాలన్న ట్విట్టర్.. ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. బ్లూ టిక్ లేని యూజర్లకు కొత్త ఫీచర్ ఇచ్చినట్టే ఇచ్చి డబ్బులు డిమాండ్ చేస్తుంది. బ్లూ టిక్ లేకుంటే మీ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు డైరెక్ట్ మెసేజింగ్ ద్వారా మెసేజ్ పంపితే ఛార్జీలు చెల్లించాల్సిందేనంటూ ఎలన్ మస్క్ కొత్త ఫిట్టింగ్ పెట్టాడు.వినియోగదారులు పేమెంట్ సర్వీసైన ట్విట్టర్ బ్లూకు సభ్యత్వాన్ని పొందేలా చేసేందుకు, వెరిఫై చేయని అకౌంట్ల కోసం డైరెక్ట్ మెసేజ్‌లపై ఆంక్షలను విధించడానికి ట్విట్టర్ ఈ కొత్త మార్పులు తీసుకొచ్చింది. వెరిఫైడ్ చేయని ట్విట్టర్ యూజర్లకు మెసేజ్ సామర్థ్యాలను పరిమితం చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్ అప్‌గ్రేడ్ చేయడంతో పాటు మరింత మెరుగుపరచేలా ప్రోత్సహిస్తోంది.జూలై 22 నుంచి ట్విట్టర్ యూజర్లు పంపగల డైరెక్ట్ మెసేజ్‌ల సంఖ్యపై వెరిఫై చేయని అకౌంట్ల కోసం షరతులు పెట్టింది. అయితే, కంపెనీ ఇంకా నిర్దిష్ట పరిమితులను వెల్లడించలేదు. మరిన్ని మెసేజ్‌లను పంపడానికి యూజర్లు పేమెంట్ సర్వీసు అయిన ట్విట్టర్ బ్లూకు సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. ఇటీవల, రిసీవర్ ఫాలో చేయని వెరిఫైడ్ యూజర్ల నుంచి మెసేజ్‌లు ప్రత్యేక మెసేజ్ రిక్వెస్ట్ ఇన్ బాక్స్ కి మూవ్ చేసే ఒక ఫీచర్‌ను ట్విట్టర్ రూపొందించింది. ఈ చర్యలతో ట్విట్టర్ వినియోగదారులు కానివారిపై ఆంక్షలను విధిస్తుంది. అయితే, కంపెనీ లాగిన్ చేయని వినియోగదారుల కోసం వెబ్‌లో ట్వీట్‌లు, వ్యాఖ్యలకు యాక్సెస్‌ను పరిమితం చేసింది.

బైజూస్‌ కాంట్రాక్టుపై పవన్‌ ప్రశ్నల వర్షం

నష్టాల్లో ఉన్న బైజూస్‌ కంపెనీకి రూ.కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని ట్విటర్‌ వేదికగా నిన్న ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌..  ఇవాళ మరికొన్ని ప్రశ్నలు సంధించారు. ‘‘బైజూస్‌ కంటెంట్‌ కోసం వచ్చే ఏడాది నుంచి ఖర్చు ఎవరు భరిస్తారు? కంపెనీ వారు ప్రతి ఏడాది ఉచితంగా ఇస్తారా? ఈ విషయంలో క్లారిటీ లోపించింది’’ అని ట్వీట్‌ చేశారు