Health

ధూమపానం అలవాటు మానిపించే ఔషధం

ధూమపానం అలవాటు మానిపించే ఔషధం

పొగతాగడం మానేయాలనుకునేవారికి శుభవార్త. తూర్పు ఆసియా వృక్షాల నుంచి తయారుచేసిన Cytisinicline ఔషధంతో సానుకూల ఫలితాలు వచ్చినట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఈ పి‌ల్‌ తీసుకున్నవారిలో కేవలం రెండు నెలల్లోనే మూడోవంతు మంది పొగతాగడం మానేశారని వెల్లడైంది. మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌కు చెందిన టొబాకో రీసెర్చ్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌ 810 మంది పొగరాయుళ్లపై ఈ అధ్యయనం నిర్వహించింది. కొంతమందికి ఆరు వారాలపాటు, మరికొంతమందికి 12 వారాలపాటు ఈ పిల్‌ను రోజూ అందించారు. ఆరువారాలపాటు తీసుకున్నవారు పూర్తిగా పొగమానేశారు. 12 వారాలపాటు తీసుకున్నవారిలో మూడొంతుల మంది స్మోకింగ్‌ మానుకున్నారు.ప్రస్తుతం దేశంలో 26 కోట్ల మందికిపైగా పొగాకు ఉత్పత్తులు వాడుతున్నట్టు వివిధ సర్వేల్లో వెల్లడైంది. పొగాకు కారణంగా ఏటా 12 లక్షల మంది మృత్యువాతపడున్నట్టు తేలింది. దేశంలో 27 శాతం క్యాన్సర్‌ కేసులకు పొగాకే కారణం.