Politics

పవన్‌పై క్రిమినల్ డిఫమేషన్ కేసు

పవన్‌పై క్రిమినల్ డిఫమేషన్ కేసు

విజయవాడ సివిల్ కోర్టులో జనసేన అధినేత పవన్‌పై క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదు చేశారు. వాలంటీర్ ఇచ్చిన కేసును విచారణకు న్యాయమూర్తి స్వీకరించారు. పవన్ అనుచతి వ్యాఖ్యలపట్ల తాను మానసిక వేదనకు గురయ్యానని మహిళా వాలంటీర్ తెలిపారు. మహిళా వాలంటీర్ న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. వాలంటీర్ తరపున న్యాయవాదులు కేసు దాఖలు చేశారు. ప్రతి గ్రామంలో ఎవరెవరు ఏ పని చేస్తున్నారు, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా, వితంతువులున్నారా? అనే వివరాలను వాలంటీర్లు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడమే కాకుండా వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారంటూ పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసందే.