Business

విమానాశ్రయ భద్రత కోసం ప్రత్యేక ఏజెన్సీ

విమానాశ్రయ భద్రత కోసం ప్రత్యేక ఏజెన్సీ

విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టుల వద్ద భద్రతకు ప్రత్యేక సెక్యూరిటీ ఏజెన్సీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ ప్యానల్‌ సూచించింది. విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనకు సంబంధించిన కేసులను డీల్‌ చేసేందుకు స్పెషల్‌ ఎయిర్‌లైన్‌ వింగ్‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులపై కఠినంగా వ్యవహరించాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ)కు సూచించింది.మొత్తం 353 సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌) యూనిట్లలో 66 యూనిట్లు ఎయిర్‌పోర్టుల భద్రతకు కేటాయించారు. పౌర విమానయాన రంగం వేగంగా వృద్ధి చెందే అవకాశాలున్న నేపథ్యంలో విమానాశ్రయాల భద్రతకు మరింత మంది సిబ్బంది అవసరమవుతారని ప్యానల్‌ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కేవలం ఎయిర్‌పోర్టుల భద్రతకు ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రస్తుతం దేశంలో 148 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి.