Politics

కేటీఆర్ కి స్పెషల్ బర్త్ డే విషెస్

కేటీఆర్ కి స్పెషల్ బర్త్ డే విషెస్

ఇవాళ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అలాగే కొంతమంది లీడర్లు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.ఇక ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సంతోష్ అనే యువకుడు వినూత్నంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అని రాసి ఉన్న ఫ్లెక్సీ ని పట్టుకొని పారాషూట్ తో ఆకాశంలో విహరిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోను ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేసి పోస్టు చేశారు. దీనికి రియాక్ట్ అయిన మంత్రి కేటీఆర్. ప్రత్యేక ధన్యవాదాలు సంతోష్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.