ScienceAndTech

గామా రేడియేషన్ తో ఉల్లిపాయలు నిల్వ

గామా రేడియేషన్ తో ఉల్లిపాయలు నిల్వ

ఉల్లిపాయల ధరల్లో హెచ్చుతగ్గులను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇరేడియేషన్‌ సాంకేతికతను తెరపైకి తెచ్చింది.దేశవ్యాప్తంగా ప్రస్తుతం టమోటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఉల్లిపాయల పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. ఇరేడియేషన్‌ ప్రక్రియలో ఆహారాన్ని రేడియేషన్‌ అయనీకరణానికి గురిచేస్తారు. ఇందుకోసం గామా కిరణాలు, ఎక్స్‌ కిరణాలు, ఎలక్ట్రాన్‌ కిరణాలను వినియోగిస్తారు. ప్రస్తుతం మన ఉల్లిపాయలను గామా రేడియేషన్‌కు గురి చేయనున్నారు. ఫలితంగా అందులోని సూక్ష్మజీవులు, కీటకాలు నశిస్తాయి. దీనివల్ల ఉల్లిపాయల నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అదే సమయంలో.. నాణ్యత, రుచి, ఆకృతి తదితరాల్లో ఎలాంటి మార్పు ఉండబోదు. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటివి ఎక్కువ కాలం నిల్వ ఉంచితే మొలకలు వస్తాయి. ఈ ప్రక్రియ అలా రానివ్వదు. ఉల్లిపాయల ధరల్లో హెచ్చుతగ్గులను నివారించేందుకు ఈ ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం సుమారు 3లక్షల టన్నుల సరకును అదనపు బఫర్‌ స్టాక్‌గా సేకరించనుంది. శీతల గిడ్డంగికి తరలించడానికి ముందే వాటిని ప్రయోగాత్మకంగా ఇరేడియేషన్‌కు గురిచేస్తుంది. ఇందుకు బాబా అణు పరిశోధన కేంద్రం సాయాన్ని తీసుకోనుంది.