Devotional

57 వేల ఆలయాలకు టీటీడీ చేయూత

57 వేల ఆలయాలకు టీటీడీ చేయూత

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ (TTDT) దక్షిణ భారతదేశంలోని 57 వేల దేవాలయాల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం ట్రస్ట్ ప్రత్యేక మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసింది. దక్షిణ భారతదేశంలోని దేవాలయాల పునరుద్ధరణ పనులను చేపడుతామని వారణాసిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ టెంపుల్ కనెక్ట్ ఎక్స్‌పో (ITCEx)లో టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

దక్షిణ భారతదేశంలోని వివిధ కులాలకు చెందిన దేవాలయాలను పునరుద్ధరించడానికి అతి త్వరలోనే డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. ఆదివారం (జులై 23న) ముగిసిన రెండు రోజుల ఎక్స్‌పోలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ఎక్స్‌పోకు 450 మంది దేవాలయాల నిర్వాహకులు హాజరయ్యారు.దేవాలయాల పునరుద్ధరణ ఆవశ్యకత గురించి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలియజేశారు. దేశంలోని దేవాలయాలపై సర్వే జరగాలన్నారు. గ్రామాలు, వీధుల్లోని దేవాలయాలు తప్పనిసరిగా జాబితాలో చేర్చాలన్నారు. చిన్న ఆలయాల నిర్వహణకు సహాయం అవసరమని చెప్పారు. డిజిటల్ యుగంలో యువతను దేవాలయాలకు రప్పించాలని అన్నారు. దేవాలయాల అనుసంధానం సమాజాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు.