చాలా మంది రక్తదానం, నీళ్లదానం, వస్త్రదానం.. అన్నింటికంటే ముఖ్యమైనది అన్నదానం చేస్తుంటారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని పెద్దలు చెబుతుంటారు. అన్నదానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని, ఎంతోమంది పేదలకు, అనాథ ఆశ్రమాల్లో దానాలు చేస్తుంటారు. అయితే శ్రావణమాసంలో ఈ నాలుగు వస్తువులను కనుక దానం చేసినట్లయితే ఇంట్లో దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక శనివారాల్లో నూనెను దానం చేస్తే వాళ్ల ఇంట్లో దరిద్రం పోతుందని భావిస్తారు. కానీ అవాస్తవం. ఇది వ్యతిరేక ఫలితాలను తెచ్చిపెడుతుంది. అలాగే స్టీల్ పాత్రలను అస్సలు దానం చేయకూడదట. ముఖ్యంగా చీపురు, ఉప్పు, కారం, ఇనుము అస్సలు దానం ఇవ్వకూడదు. ఇవి దానం చేస్తే ఇంట్లో ఎన్నో సమస్యలతో పాటు అనారోగ్య పాలవుతారు. కాబట్టి ఆడవాళ్లు ఈ వస్తువులను ఎప్పటికీ దానం చేయవద్దు.