DailyDose

సింగపూర్‌లో 20 ఏళ్లలో తొలిసారిగా మహిళకు మరణశిక్ష-TNI నేటి నేర వార్తలు

సింగపూర్‌లో 20 ఏళ్లలో తొలిసారిగా మహిళకు మరణశిక్ష-TNI నేటి నేర వార్తలు

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ముగ్గురు నైజీరియన్లతో పాటు ఇద్దరు భారతీయులు అరెస్ట్ అయ్యారు. అయితే ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ తరహాలోనే డ్రగ్స్ కేసుల్లోనూ విదేశాలకు లాభాలు మళ్లించినట్లు హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. ఈ కేసు లావాదేవీలపై ఆరా తీశారు. డ్రగ్స్ కోసం కస్టమర్ల నుంచి రూ.4 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. 22 విదేశీ ఖాతాలకు నగదు మళ్లించగా.. ఇందుకోసం 22 బ్యాంక్ ఖాతాలను ఆపరేట్ చేస్తున్నాడు డ్రగ్స్ సప్లయర్ హెన్రీ. దీంతో హెన్రీ కోసం గాలిస్తున్నారు హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు. దాదాపు 200 మంది కస్టమర్లు హెన్రీ వద్ద డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

*  ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి అదృశ్యం ఘటన

ఐఐటీ స్టూడెంట్ మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మారింది. కొడుకు ఆచూకీ కోసం కంట్లో దీపాలు పెట్టుకుని తిరుగుతున్న తల్లితండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చేలా విశాఖ బీచ్ లో మునిగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కోటి ఆశల సౌధం ఆయిన కొడుకు కళ్లముందు అచేతనంగా పడి ఉండటాన్ని తల్లితండ్రులు జీర్ణించుకోలేక పోయారు. కొండంత ఎత్తైన తమ కలల సౌధం కళ్లముందు కనుమరుగౌతుండడాన్ని తట్టుకోలేక తల్లడిల్లి పోతున్నారు. మరికాసేపట్లో దొరుకుతాడని ఎదురు చూస్తున్న కొడుకు అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీచ్ లో నిర్జీవంగా పడి ఉన్నారన్న వార్త ఆ తల్లి తండ్రులను కుదిపేసింది. పర్స్ , చెప్పులు అన్నీ గట్టున పెట్టీ బలవన్మరణానికి పాల్పడ్డ కార్తీక్ నాయక్ (21) మృత దేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.ఐఐటీ హెచ్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ లో చేరిన కార్తిక్ ఎనిమిది రోజుల క్రితం కళాశాల క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. సంగారెడ్డి రూరల్ కంది పోలీస్ స్టేషన్ ఎస్ ఐ రాజేష్ నాయక్ టీవీ9 తో తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన సాధారణ రైతు, చిరు వ్యాపారి అయిన ఉమ్ల నాయక్ కుమారుడు కార్తీక్ ఐఐటీ హెచ్లో బీటెక్-మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 17న ఐఐటీ క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. 17 వ తేదీ ఉమ్లా నాయక్ ఫోన్ చేసినా కార్తీక్ లిఫ్ట్ చేయలేదు.

జార్ఖండ్ లో ఘోరం

జార్ఖండ్‌లోని పకూర్ జిల్లాలో 36 ఏళ్ల గిరిజన మహిళపై డజను మంది గూండాలు అత్యాచారం చేసిన సిగ్గుమాలిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాధిత మహిళ తాను ఢిల్లీలో పనిచేస్తున్నానని చెప్పింది. ఆమె వారం క్రితమే ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. గత ఆదివారం సాయంత్రం ప్రియుడితో కలిసి బైక్‌పై కూర్చొని అంపాడుకు వచ్చింది. అంపాడకు చేరుకోగానే ప్రేమికుడు ఓ స్వీట్ షాపులో స్వీట్లు కొన్నాడు. దీని తర్వాత ప్రేమికుడు మహిళను ఫుట్‌బాల్ గ్రౌండ్ దగ్గరకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న దాదాపు డజను మంది యువకులు మహిళను బలవంతంగా పట్టుకుని చెట్టు పక్కకు తీసుకెళ్లారు. అక్కడ వారంతా ఆమెపై అత్యాచారం చేశారని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత ఉదయం స్పృహలోకి వచ్చిన మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.ఘటన తర్వాత ప్రేమికుడు కూడా పరారీ అయ్యాడని, తన ప్రేమికుడి పేరు హెంబ్రామ్ అని మాత్రమే తెలుసని మహిళ పోలీసులకు చెప్పింది. అదే సమయంలో మహిళను చికిత్స నిమిత్తం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం సదర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందని జిల్లా ఎస్‌డిపిఓ అజిత్ కుమార్ విమల్ తెలిపారు. ఆ మహిళ తన ప్రేమికుడి పేరు చెప్పలేకపోయింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న నిందితులందరినీ త్వరలోనే పట్టుకుంటామన్నారు

*  మైనర్ బాలికపై స్కూల్ టీచర్ అత్యాచారం

 పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ పాఠశాల ఆవరణలో మైనర్ బాలికపై ఆమె ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడు. ఆ టీచర్ బాధితురాలు టాయిలెట్‌కు వెడుతుంటూ వెంబడించి, వాష్ రూంలో బంధించి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె సహాయం కోసం అరవడంతో ఆమెను బాత్రూంలో పెట్టి, తాళం వేశాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. జూలై 21న ఢోలాఘాట్ హై మదర్సాకు చెందిన ఫైజుద్దీన్ మొల్లా అనే నిందితుడు బాధితురాలు వాష్ రూంకు వెడుతుండగా వెంబడించాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె సహాయం కోసం కేకలు వేయడంతో అతను ఆమెను వాష్‌రూమ్‌లో లాక్కెళ్లి, చెంపదెబ్బ కొట్టాడు. ఆ తరువాత అక్కడే ఆమెను బంధించి, తాళం వేశాడు.బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అవి విన్న ఆమె స్నేహితులు రక్షించారు. వాష్ రూం నుంచి ఆమెను బైటికి తీసుకునవచ్చి జరిగిన విషయాన్ని ఆమె తల్లికి సమాచారం అందించారు. “ఫైజుద్దీన్ మొల్లా టాయిలెట్ బయట తాళం వేసి నా కూతుర్ని అందులో బంధించాడు. విషయం తెలిసి నేను స్కూల్ దగ్గరికి చేరుకున్నాను. నా కూతురిని అలా ఎందుకు బంధించారని ఆరా తీశాను. దీనికి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది” అని బాధితురాలి తల్లి పేర్కొంది.దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం ఢోలాఘాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం సాయంత్రం నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 376, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు.

 అంబులెన్స్ బోల్తా పడి డ్రైవర్ మృతి

హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్ చౌరస్తాలో ఓ అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. అంబులెన్స్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున ఇబ్రహీంపట్నం నుంచి వస్తున్న అంబులెన్స్ బీఎన్ రెడ్డి చౌరస్తాలో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన అంబులెన్స్ డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.అయితే అందులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో అంబులెన్స్ ధ్వంసమైంది. దీంతో అతడు మృతి చెందాడు. సమాచారం అందదిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని మహేశ్ గా గుర్తించారు.కాగా, మలక్ పేటలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగిని ఇంటివద్ద వదిలి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడం, ఇతర వాహనాలు కూడా లేనందున పెను ప్రమాదం తప్పింది.

*   చైనాలో 15000 మంది 712కోట్లు మోసపోయారు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి దేశంలోని అన్ని బ్యాంకుల వరకు సైబర్ మోసాలను నివారించడానికి వినియోగదారులను హెచ్చరిస్తూనే ఉన్నాయి. రోజుకో కొత్త సంఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా చైనాలో కూర్చుని 15 వేల మంది భారతీయులను సైబర్ నేరగాళ్లు మొత్తం రూ.712 కోట్ల మేర మోసగించారు. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు దేశవ్యాప్తంగా 9 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా భారతదేశంలో పెట్టుబడి మోసానికి నాయకులు. కానీ దాని నిజమైన ఆపరేటర్లు చైనానుంచే పనిచేస్తున్నారు. అంటే.. ఈ మోసగాళ్లు చైనాలో కూర్చుని సుమారు 15 వేల మంది భారతీయులను రూ.712 కోట్ల మేర మోసం చేశారు.నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు, స్కీమ్‌ల ద్వారా వ్యక్తులతో ఈ మోసం జరుగుతోంది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. చైనాలో కూర్చున్న ఆపరేటర్లు ఆకర్షణీయమైన ఆఫర్‌లు ఇవ్వడం ద్వారా ప్రజలను డబ్బు పెట్టుబడి పెట్టమని కోరేవారు. దీని ద్వారా వచ్చిన డబ్బును క్రిప్టోగా మార్చి దుబాయ్ మీదుగా చైనాకు పంపించారు. ఈ వ్యక్తులు మోసంతో పాటు మనీలాండరింగ్ కూడా చేస్తున్నారు. టెలిగ్రామ్ యాప్‌లో పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ వచ్చిందని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఉద్యోగం ‘రేట్ ది రివ్యూ’ అనే కంపెనీకి సంబంధించినది. దీని కోసం, అతను ఒక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్నాడు. అక్కడ అతనికి 5-స్టార్ రేటింగ్‌లను 5 సెట్ల టాస్క్ ఇచ్చారు. ఇందుకోసం అతడి నుంచి రూ.1000 డిపాజిట్ అడగగా రూ.866 లాభం వచ్చింది.

హత్య కేసులో వైకాపా నేత అనుచరుడు

ఓ హత్య కేసులో అన్నమయ్య జిల్లాకు చెందిన అధికార పార్టీ ముఖ్యనేత అనుచరుడు ఒకరి పేరు బయటకు రావడం కలకలం రేకెత్తిస్తోంది. చిత్తూరు జిల్లా వైకాపా అధికార ప్రతినిధి భక్తవత్సలం మృతదేహం తిరుపతి జిల్లా వడమాలపేట మండలం కదిరిమంగళం వద్ద ఈ నెల రెండో తేదీన అనుమానాస్పద స్థితిలో కనిపించింది. పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేయడంతో హత్యగా తేలింది. ఇందులో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత అనుచరుడు జ్ఞానప్రకాష్‌రెడ్డి అలియాస్‌ చింటూ పాత్ర ఉన్నట్లు తేలడంతో విచారణ రహస్యంగా చేపట్టారు. భక్తవత్సలం బెంగళూరుకు చెందిన వ్యక్తికి బకాయి ఉండటంతో దాన్ని రాబట్టుకునేందుకు కొందరు ఈ నెల ఒకటిన ఆయనను కిడ్నాప్‌ చేయగా.. తన వద్ద రూ. 8 కోట్లు ఉన్నాయని, ఇంటికి తీసుకెళ్తే రూ.3 కోట్లు ఇస్తానని చెప్పాడు. తీరా వెళ్లగానే తనను కిడ్నాప్‌ చేశారంటూ కేకలు వేయడంతో తీవ్రంగా కొట్టడంతో భక్తవత్సలం చనిపోయారు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిదిమంది నిందితులు అదుపులో ఉన్నా పోలీసులు.. ఎలాంటి సమాచారాన్ని బహిర్గతం చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మద్యం మత్తులో భార్యతో గొడవ పడి: ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్ జిల్లాలో మద్యం మత్తులో భార్యతో గొడవ పడిన వ్యక్తి స్తంభం ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్యతో గొడవ పడి ఆత్మహత్య చేసుకునేందుకు స్తంభం ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకొని వేలాడాడు. సకాలంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఆర్ కే కాలనీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బాలు అలియాస్ ప్రవీణ్ తన భార్యతో గొడవ పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న బాలు ఆత్మహత్య చేసుకుంటానని కాలనీలోని విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయించారు.స్తంభం ఎక్కిన బాలు కొద్దిసేపు అలాగే విద్యుత్ తీగలకు వేలాడాడు. స్థానికులు ఎంత చెప్పినా వినలేదు. కొద్దిసేపటి తర్వాత తీగలను వదిలేసి, కిందపడ్డాడు. చికిత్స కోసం గాయపడ్డ బాలును స్థానికులు ఆటోలో రిమ్స్ కు తరలించారు. డాక్టర్లు అతనికి వైద్యం అందిస్తున్నారు.

సింగపూర్‌లో 20 ఏళ్లలో తొలిసారిగా మహిళకు మరణశిక్ష

మాదకద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో సింగపూర్ అత్యంత కఠిన శిక్షలు అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే  మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులు ఇద్దరు దోషులకు మరణశిక్ష విధించింది. ఆ శిక్షను ఈ వారం అమలు చేయనుంది. అయితే ఈ శిక్ష పడిన ఇద్దరిలో ఓ మహిళ కూడా ఉంది.  ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. గత 20 ఏళ్లలో  సింగపూర్లో ఓ మహిళను ఉరి తీయడం ఇదే మొదటిసారి.ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే…  ఓ 56 ఏళ్ల వ్యక్తి  50 గ్రాముల హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేశాడు.  అతడిని ఈ కేసులో దోషిగా  తేల్చి బుధవారం  అంటే జూలై 26వ తేదీన చాంగీ జైలులో ఉరి తీయనున్నారు. ఈ మేరకు స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్ ఫార్మేటివ్  జస్టిస్ కలెక్టివ్ తెలిపింది.ఇదే కేసులో శిక్ష పడిన మరో మహిళ సారిదేవి దామని(45)కి జూలై 28వ తేదీన ఉరిశిక్ష అమలు చేయనున్నారు. సారిదేవి  30 గ్రాముల హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేసిన కేసులో 2018లో ఆమె ఉరిశిక్ష విధించారు.  అప్పటినుంచి జైల్లోనే ఉన్న సారీ దేవికి ఇప్పుడు ఉరిశిక్ష అమలు చేయనున్నారు.  దీనికి సంబంధించిన వివరాలను వారి కుటుంబాలకు ఇప్పటికే నోటీసులు పంపించినట్లుగా  తెలిసింది.ఈ ఉరిశిక్ష గనక అమలు అయితే 20 ఏళ్లలో ఓ మహిళను ఉరి తీయడం సింగపూర్లో ఇదే మొదటిసారి కానుంది. 2004లో డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో ఓ 36 ఏళ్ల మహిళకు ఉరిశిక్ష వేశారని టీజేసీ కార్యకర్త కోకిల అన్నామలై తెలిపారు. అయితే, హక్కుల సంఘాలు వీరిద్దరికీ ఉరిశిక్షను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి.

ఏకంగా ట్రాఫిక్ పోలీస్ బూత్ లో మద్యం తాగారు

ఎవరి డబ్బులతో వాళ్లు మద్యం కొని.. తాగొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. అందులో ఎలాంటి తప్పులేదు. కానీ.. పబ్లిక్ ప్లేసుల్లో, అది కూడా ట్రాఫిక్ పోలీస్ బూత్ లో తాగితే పోలీసులు ఊరుకుంటారా..? ఏమో అంటారా..? మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీస్ బూత్ లో ఇద్దరు యువకులు మద్యం తాగుతూ చాలాసేపు హల్ చల్ చేశారు. అందరూ చూస్తుండగానే ట్రాఫిక్ పోలీస్ బూత్ లో ఎంచక్కా కూర్చుని మందు తాగారు. తమను ఎవరూ ఆపలేరన్న దీమాతో మద్యం తాగారు. తినడానికి స్టఫ్, మద్యంలో పోసుకోవడానికి వాటర్ బాటిల్స్ తెచ్చుకుని ఎంచక్కా తాగారు. ఈ ప్రజలతో తమకెలాంటి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు.రోడ్డుపై వెళ్లేవారు తమను చూస్తున్నారని కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు. ట్రాఫిక్ పోలీస్ బూత్ లో కూర్చుని మద్యం తాగితే పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయం లేకుండా..కేసులు పెడుతున్నారన్న సోయి కూడా లేకుండా గంటల తరబడి కూర్చుని మద్యం తాగారు.నిత్యం మహిళలు, ఐటీ ఉద్యోగులు తిరిగే ఈ ప్రాంతంలో పోకిరులు ఇలా దర్జాగా మందు తాగుతున్నా పోలీసులు పట్టించుకోలేదన్న విమర్శలు వినిపించాయి. పట్టపగలు బహిరంగ ప్రదేశంలో ఇలా మందు తాగుతూ.. బిర్యానీ తింటూ ఎంజాయ్ చేశారు.