Business

100 నోటు వెనుక ఉన్న ఈ బొమ్మ ఏంటో తెలుసా?

100 నోటు వెనుక ఉన్న ఈ బొమ్మ ఏంటో తెలుసా?

 పాత నోట్లను రద్దు చేసిన తరువాత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India)కొత్త నోట్లను తీసుకొచ్చింది. పాత రూ.500 నోట్లతో పాటు కొత్త రూ.100 నోట్లు కూడా వచ్చాయి. కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో ఆ నోటు డిజైన్ దానిమీద ఏర్పాటు చేసే బొమ్మలు చాలా చాలా ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంట్లో భాగంగానే కొత్త రూ.100 నోటు వెనుక భాగంలో ఓ బొమ్మను మీరు ఎప్పుడైనా గమనించారా..? ఇది భారతదేశ చరిత్రకు సంబంధించిన అత్యద్భుతమైన కట్టడం. ఈ కట్టడం వెనుక ఓ రాణి ఉంది. ఆ రాణి సృజనాత్మకతను ఈ అద్భుత కట్టడంలో చూడొచ్చు.అత్యద్భుతనమైన చిత్రకళ..అమోఘమైన ఆర్కిటెక్చర్ ఈ కట్టడంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది.

ఆ కట్టడం పేరు ‘రాణి కా వావ్’(Rani ki Vav) ఈ కట్టడం గుజరాత్ లోని పఠాన్ (Pathan)పట్టణంలో ఉంది. యునెస్కో (UNESCO)గుర్తింపు పొందింది ఈ కట్టడం. ఇది ఒక మెట్ల బావి. ఓ కట్టడం వెనుక సోలంకి వంశానికి చెందిన చెందిన రాణి ఉదయమతి ఆలోచన ఉంది.ఆమె తన భర్త కోసం ఈ బావిని నిర్మించారట. ఉదయమతి తన భర్త భీమ-1 గుర్తుగా 1050-1100 మధ్య సరస్వతి నది ఒడ్డున నిర్మించారు. కాగా సరస్వతి నది ఇప్పుడు కంటికి కనిపించకుండాపోయింది. అంతర్వాహినిగా ఈ నది ప్రవహిస్తుందని అంటారు. ఈ నదికి సంబంధించి ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా సర్వస్వతీ నది హిమాలయాల్లో పుట్టి హరయానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి కచ్ సింధు శాక (రాన్ ఆఫ్ కఛ్(Rann of Kutch)వద్ద అరేబియా సముద్రం(Arabian Sea)లో కలుస్తుందని దీని పొడవు సుమారు 1600కిలోమీటర్లు అని తెలుస్తుంది.

అలా సరస్వతి నది (Saraswati River)ఒడ్డున రాణి ఉదయమతి (Rani Udayamati)ఈ మెట్ల బావిని నిర్మించారట. ఈ బావి మొత్తం ఏడు అంతస్థుల్లో అత్యంత అద్భుతంగా నిర్మించబడింది. సాధారణంగా ఏడు అంతస్తులు అంటే సమాంతరంగా ఉండకపోవటం ఈ బావి ప్రత్యేకత అని చెప్పాలి. ఈ బావి నిర్మాణం అంతా వింతలు విశేషాలతో నిండి ఉంటుంది. సాధారణంగా నిర్మాణాలు నేలమీద నుంచి పైకి అంతస్తులుగా నిర్మిస్తారు. కానీ దీన్ని మాత్రం భూమి లోపలికి ఏడు అంతస్థులుగా నిర్మించారు. పైకి వెడల్పుగా కనిపిస్తుంది.లోపలికి వెళ్లేకొద్ది ఇరుకుగా ఉంటుంది. 360 డిగ్రీల యాంగిల్లో ఇది ఉంటుందట.భూమి లోపలికి తవ్వుతు ఈ బావిని నిర్మించుకుంటుపోయారట. ఇలా నిర్మించటా చాలా కష్టమైనప్పటికీ ఈ నిర్మాణం భారతీయుల ఇంజరీనిరింగ్ ప్రతిభకు ఓ అద్భుతమైన ఉదాహరణ అని చెప్పి తీరాలి. ఈ బావి 213 అడుగుల పొడవు, వెలడ్పు 66 అడుగులు ఉంటుంది. లోతు 92 అడుగులు. 215 స్థంబాల గల ఈ బావి నిర్మాణంలో దాదాపు 800ల అత్యద్భుతమైన శిల్పాలు కళ్లు తిప్పుకోనివ్వవు. భారతీయ శిల్పకళా వైభవానికి మచ్చు తునకలుగా ఈ శిల్పకళ కనిపిస్తుంది. బావి గోడలమీద దశావతారాల కథలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి.

ఈ బావికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ బావి లోపలికి దిగిన కొద్దీ ఉస్ణోగ్రత తగ్గి చల్లగా ఉంటుంది. ఈ బావిని నిర్మించిన సమయంలో ఎన్నో రకాల ఔషధ మొక్కలను నాటి పెంచి సంరక్షించారట. అందుకే ఈ బావినీటితో స్నానం చేస్తే ఎన్నో వ్యాధులు తగ్గేవని చెబుతుంటారు. ఇంత అద్భుతమైన బావి అప్పట్లో సరస్వతి నదికి వరదలు వచ్చి బావి ఇసుకలో కూరుకుపోయిందట.1980లో ASI (archeological survey of India) జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడింది.2014లో ఈ కట్టడానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద బాబితాలోకి చేర్చింది. ఇంత అద్భుత నిర్మాణం కొత్త రూ.100 నోటుమీద ముద్రించింది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాదాపుగా అప్పటి వరకు గుజరాత్ లో చారిత్రాత్మకమైన ఈ అద్భుత నిర్మాణం గురించి వెలుగులోకి వచ్చింది.కాగా ఈ బావికి ఓ తలుపును నిర్మించారు. అది రాజుల పాలన కాలం కాబట్టి శత్రురాజులు దాడి చేయకుండా ఈ తలుపు తెరిచి లోపల 30 కిలోమీటర్ల పొడవు సొరంగాన్ని నిర్మించారట. ఈ సొరంగం సిద్ధాపూర్ అనే పట్టణానికి వెళ్లేలా ఏర్పాటు చేశారు