పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలను జోన్ -2గా నిర్ణయించిన తెదేపా.. ఆ జోన్‌కు సమన్వయకర్త (కోఆర్డినేటర్)గా రవి మందలపును నియమించింది. జోన్ 2లో అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు తదితర నియోజకవర్గాలున్నాయి. ఈ జోన్ పరిధిలో మొత్తం 32మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఇటీవల జరిగిన తానా 23వ మహాసభల సందర్భంగా జరిగిన ఎన్నారై తెదేపా- యూఎస్‌ఏ సమావేశంలో తెదేపా నేత డాక్టర్ రవి వేమూరు రవి మందలపు నియామకంపై ఎన్నారైలకు తెలియజేశారు. జోన్-2 సమన్వయకర్తగా రవి మందలపును తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నియమించారని చెప్పారు. తన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన రవి మందలపు.. తెదేపా విజయానికి శాయశక్తులా కృషిచేస్తానని చెప్పారు.