NRI-NRT

బ్రిటన్‌లో H1 తరహా కొత్త వీసా

బ్రిటన్‌లో H1 తరహా కొత్త వీసా

భారతీయ గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు బ్రిటన్‌లో రెండేళ్లపాటు నివసిస్తూ చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి వీలు కల్పించే యూకే-ఇండియా యువ వృత్తి నిపుణుల పథకం కింద రెండో బ్యాలట్‌ను బ్రిటన్‌ ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. బ్యాలట్‌ జూలై 27తో ముగుస్తుంది. ఈ పథకం కింద దాదాపు 3 వేల మంది భారతీయ ఉన్నత విద్యావంతులు 2023 సంవత్సరానికి బ్రిటన్‌లో ప్రవేశానికి వీసా పొందగలుగుతారు. ఫిబ్రవరిలో జరిగిన మొదటి బ్యాలట్‌లోనే చాలా స్థానాలు భర్తీ కాగా, మిగిలిన స్థానాలను రెండో బ్యాలట్‌లో భర్తీచేస్తారు. జకార్తాలో గత నవంబరులో భారత ప్రధాని మోదీ, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ పథకం అమలులోకి వచ్చింది.