కాచిగూడ రైల్వే స్టేషన్‌లో రెండు రైలు బోగీలను అధునాతన రెస్టారెంట్‌లాగా తీర్చిదిద్దారు. రైల్వే ప్రయాణికులకు నాణ్యమైన ఆహార పదార్థాలను రోజంతా అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించారు. సోమవారం నుంచే ఈ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చిందని, ప్రయాణికులకు 24 గంటలు ఆహార పదార్థాలు అందిస్తుందని చెప్పారు. తెలంగాణలో మొదటిసారిగా రైలు బోగీల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేసిన ఘనత దక్షిణమధ్య రైల్వేకే దక్కిందని అన్నారు. ఈ రెస్టారెంట్‌కు ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్’ అని పేరు పెట్టారు.