దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ తలసరి ఆదాయం అతి తక్కువగా ఉందని కేంద్ర గణాంకాల వ్యవహారాలశాఖ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ సమాధానంగా వెల్లడించారు. ఏపీ తలసరి ఆదాయం తాజా ధరల ప్రకారం 2022-23లో రూ.2,19,518 ఉండగా, స్థిర ధరల ప్రకారం రూ.1,23,526కే పరిమితమైంది. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,08,732, స్థిర ధరల ప్రకారం రూ.1,64,657 ఉంది. కర్ణాటక తలసరి ఆదాయం రూ.3,01,673, స్థిర ధరల ప్రకారం రూ.1,76,383గా ఉంది. తాజా ధరల ప్రకారం తెలంగాణ దక్షిణాదిలో ప్రథమ స్థానంలో నిలిచినప్పటికీ, స్థిర ధరల కొలమానంలో మూడో స్థానంలో ఉంది. కర్ణాటక ప్రథమస్థానంలో నిలిచింది.