కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను 2023 జూలై 25 మంగళవారం టీటీడీ రిలీజ్ చేసింది. https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి భక్తులు తమ వివరాలు నమోదు చేసి టికెట్లు బుక్ చేసుకోవాలి. ఆగస్టుతో పాటు సెప్టెంబర్ నెలకు సంబంధించిన అదనపు కోటా టికెట్లను కూడా అందుబాటులోకి ఉంచింది. రోజుకు 4 వేల చొప్పున అదనపు కోటా టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. ఇక అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకి 15 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నారు అధికారులు. ఇక వృద్దులు, వికలాంగుల దర్శన కోటా టికెట్లు ఈ రోజు మధ్యాహ్నాం రిలీజ్ కానున్నాయి.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మరోవైపు 2023 జూలై 24 న తిరుమల శ్రీవారిని 73 వేల796 మంది భక్తులు దర్శించుకున్నారు. 28 వేల 840 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.5 కోట్లుగా టీటీడీ వెల్లడించింది.