Kids

అతి టీవీ అనర్థదాయకం

అతి టీవీ అనర్థదాయకం

నేటి తరం పిల్లలు స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. మొబైల్‌ గేమ్స్‌, సోషల్‌మీడియాలో మునిగితేలుతున్నారు. శారీరక శ్రమ అస్సలు ఉండటం లేదు. ఇది వారు పెద్దయ్యాక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు టీవీ ముందు గడిపే పిల్లలు పెద్దయ్యాక హైబీపీ, ఒబెసిటీ బారిన పడే ప్రమాదం ఉన్నదని పరిశోధకులు తెలిపారు. న్యూజిలాండ్‌లో వందలాది మంది పిల్లలపై 1973 నుంచి వారు 45 ఏండ్లు వచ్చేవరకు అధ్యయనం నిర్వహించారు. వాస్తవానికి అప్పట్లో టీవీ సదుపాయాలు తక్కువ. ఈ అధ్యయనాన్ని ఇప్పటికి అన్వయిస్తే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుంది.పిల్లల స్క్రీన్‌ టైమ్‌పై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నదని ఈ అధ్యయనం సూచిస్తున్నది. స్ర్కీన్‌ టైమ్‌ను సాధ్యమైనంత వరకు తగ్గించాలని అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పిడియాట్రిక్స్‌ సిఫారసు చేసింది. అలాగే పిల్లల ఫిజికల్‌ యాక్టివిటీపైనా దృష్టి సారించాలని పరిశోధకులు చెబుతున్నారు. బడికి లేదా ఇతర పనులకు వెళ్లినప్పుడు వాహనాలకు బదులు కాలినడక వెళ్తే ఉత్తమమని సూచిస్తున్నారు.