గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని గొడవర్రు గ్రామానికి చెందిన ఆరాధ్యుల యజ్ఞనారాయణ, భూలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సుధీర్‌కుమార్ తపాలాశాఖలో విధులు నిర్వహిస్తున్నారు. చిన్న కుమారుడు కిరణ్‌కుమార్(25) ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. రెండున్నరేళ్ల కిందట లండన్ వెళ్లి ఎంఎస్ పూర్తిచేశారు. ఉద్యోగం సంపాదించడానికి నిపుణుల సూచన మేరకు కొన్ని కోర్సుల్లో ప్రావీణ్యం కోసం శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. జూన్ 26న ద్విచక్రవాహనంపై తరగతికి హాజరవడానికి వెళ్తున్నారు. అదే సమయంలో పోలీసులు ఓ దొంగను వెంటాడుతున్నారు. ఆ దొంగ వేగంగా వెళ్తూ.. కిరణ్‌ను ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన కిరణ్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. నెలపాటు వివిధ ప్రయత్నాలు చేసిన కుటుంబసభ్యులు ప్రవాస భారతీయుల సహకారంతో కిరణ్ మృతదేహాన్ని లండన్ నుంచి స్వదేశానికి విమానంలో తరలిస్తున్నారు.
లండన్‌లో గుంటూరు జిల్లా యువకుడి మృతి
Related tags :