సాంకేతికత రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధా కొత్తపుంతలు తొక్కుతోంది. భవిష్యత్తులో ఇక కృత్రిమ మేధాపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు ముమ్మాటికి జరగనున్నాయి. అయితే ఈ కృత్రిమ మేధాపై కొందరు నిపుణాలు ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుండగా మరికొందరు అనర్థాలు కూడా జరిగే అవకాశం ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏఐ చాట్బోట్లు పిల్లలకు కేవలం 18 నెలల్లోనే చదవడం, రాయడం నేర్పిస్తాయని తెలిపారు. ఇటీవల అమెరికాలోని శాన్డిగోలో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన కృత్రిమ మేధ గురించి వివరించారు.రోజురోజుకు కృత్రమ మేధ సామర్థ్యం పెరుగుతోందని.. భవిష్యత్తులో ఇది మరింత విస్తరిస్తుందని అన్నారు. చాట్బోట్లు 18 నెలల్లో పిల్లలకు చదవడం, రాయడం వంటి నైపుణ్యాలను మరింత మెరుగ్గా నేర్పించగలుగుతాయని అన్నారు. కంప్యూటర్లు రాయడం నేర్పించగలవు.. కానీ చాట్బోట్లు మాత్రం మనం ఇచ్చే దాన్ని గుర్తించి దానిలో మార్పు చేసుకోగల సామర్థ్యం ఉంటుందని తెలిపారు. అలాగే మనుషులలాగే ఇవి చక్కగా బోధించగలవని.. వారికంటే బాగా నేర్పించగలుగుతాయని చెప్పారు. ఉపాధ్యాయులకు సహయంగా ఏఐ ఉండటమే కాక పిల్లల నైపుణ్యాలను పెంపొందిస్తుందని తెలిపారు.