మాస్టర్స్ చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా వెళ్లిన తెలంగాణ యువతి అక్కడ రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది. హైదరాబాద్ మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ (Syeda Lulu Minhaj Zaidi) అనే యువతి మాస్టర్స్ చేసేందుకు 2021 ఆగస్టులో అమెరికా వెళ్లింది. యువతి వస్తువులు ఎవరో దొంగలించారని, దీంతో చికాగో రోడ్లపై జైదీ ఆకలితో అలమటిస్తున్నట్లు హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు జైదీని గుర్తించి ఆమె తల్లికి తెలియజేశారు. కుమార్తె పరిస్థితి తెలుసుకున్న యువతి తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా తన కుమార్తెను తిరిగి భారత్ కు తీసుకురావాల్సిందిగా కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ను కోరారు.
చికాగోలో హైదరాబాదీ మహిళ కష్టాలు
Related tags :