Sports

ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ రీషెడ్యూల్

ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ రీషెడ్యూల్

క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ చేసిన తేదీ కంటే ఓ రోజు ముందే జరిగే అవకాశం ఉంది. అక్టోబర్ 15న దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని, అందువల్ల మ్యాచ్ అక్టోబర్ 14న నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. రీషెడ్యూల్ త్వరలోనే రిలీజ్ కానుంది. కాగా, అక్టోబర్‌ 5వ తేదీ నుంచి నవంబర్‌ 19 వ తేదీ వరకు వన్డే వరల్డ్‌ కప్‌ జరుగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్‌ కూడా రిలీజ్‌ అయింది.