గత ఏడాది విడుదలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చాట్‌జీపీటీ గురించి, దానిని తయారు చేసిన ఓపెన్ ఏఐ సంస్థ గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. చాట్‌జీపీటీ విడుదలతో ఎథిక్స్, ప్రిన్సిపల్స్’ వంటి అంశాలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వాటిలో, ముఖ్యంగా ఉపాధ్యాయులు విద్యార్ధులకు ఏదైనా అసైన్‌మెంట‍్లు ఇస్తే.. వాటిని విద్యార్ధులు పూర్తి చేశారా? లేదంటే చాట్‌జీపీటీ నుంచి సేకరించారా? అనే విషయాల్ని గుర్తించడం కష్టంగా మారింది.ఈ అంశంపై రచయితలు, టీచర్లు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అదే సమయంలో ఆర్టిఫియల్స్ ఇంటెలిజెన్స్ టూల్స్ రాసిన కంటెంట్‌ను గుర్తించేందుకు కొన్ని రకాల టూల్స్ అందుబాటులోకి వచ్చాయి.
ఓపెన్‌ఏఐ కూడా ఓ టూల్‌ను డెవలప్ చేసింది. ఇప్పుడా టూల్‌ను షట్‌డౌన్ చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ది వెర్జ్ నివేదిక ప్రకారం..ఓపెన్ ఏఐ హ్యూమన్స్, ఏఐ టూల్స్ కంటెంట్‌ను గుర్తించేందుకు ఏఐ క్లాసిఫైర్ అనే టూల్‌ను యూజర్లకు అందించింది. ఆ టూల్‌ను ఇప్పుడు నిలిపివేస్తున్నట్లు ఓపెన్ ఏఐ తన బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది.బ్లాగ్ పోస్ట్‌లో ‘జులై 20, 2023 నుంచి ఏఐ క్లాసిఫైర్ టూల్స్ అందుబాటులో ఉండటం లేదు. హ్యూమన్స్, ఏఐ కంటెంట్‌ను గుర్తించే విషయంలో తాము రూపొందించిన టూల్ ఊహించని విధంగా పనిచేయడం లేదు. అందుకే ఏఐ క్లాసిఫైర్ సేవల్ని నిలిపివేస్తున్నాం. అంతేకాదు, కంటెంట్‌ను సమర్థవంతంగా ఎలా గుర్తించాలో తెలుసుకునేందుకు రీసెర్చ్ చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మెకానిజాన్ని తయారు చేస్తున్నాం. తద్వారా యూజర్లు ఏఐ జనరేటెడ్ విజువల్ కంటెంట్, ఆడియోలను అర్ధం చేసుకునే అవకాశం కలగనుందని’ ఓపెన్ ఏఐ తన పోస్ట్‌లో వెల్లడించింది.
నవంబర్ 30, 2022న ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని యూజర్లకు పరిచయం చేసింది. చాట్‌జీపీటీ విడుదల అనంతరం ఏఐ జనరేటెడ్ టూల్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సంస్థలు తమకు కావాల్సిన కంటెంట్‌ను మనుషులు రాస్తున్నారా? లేదంటే ఏఐ టూల్స్ నుంచి సేకరిస్తున్నారా? అని తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు.అప్పుడే ఓపెన్ ఏఐ కంటెంట్‌ను గుర్తించేందుకు ఏఐ క్లాసిఫైర్ టూల్‌ను తయారు చేసింది. కానీ 100 శాతం ఏఐ విడుదల చేసిన కంటెంట్‌ను 26 శాతం గుర్తిస్తుండగా.. మనుషులు సరైన కంటెంట్‌ను రాసినా.. మీరు రాసింది తప్పేనంటూ 9 శాతం ఫలితాల్ని అందించింది. ఈ క్రమంలో చేసేది లేక ఓపెన్ ఏఐ ఏఐ క్లాసిఫైర్ టూల్‌ను షట్‌డౌన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.