తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేయనున్నారు. తిరుమలలో శ్రీవారి పుష్కరిణికి మరమ్మతులు చేపట్టారని టీటీడీ నిర్ణయించింది. దీనికోసం ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు పుష్కరిణిని మూసివేయనుంది. ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతికి టీటీడీ విరామం ఇవ్వనుంది. పుష్కరిణికి రీసైక్లింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని టీటీడీ భావిస్తుంది.కాగా, తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ ఉంది. 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,137 మంది భక్తులు కాగా.. 27,490 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న హుండీ ఆదాయం రూ. 4.06 కోట్లుగా నమోదు అయింది. ఇక ఇవాళ వసతి గదుల టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ అక్టోబర్ నెలకు సంబంధించిన వసతి గదులు కోటాను విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. తిరుమల, తిరుపతితో పాటు తలకోనకు సంబంధించిన వసతి గదులు కోటా విడుదల చేయనుంది టీటీడీ.