Politics

సభలను అడ్డుకోవడాన్ని సమర్థించం: విజయసాయి రెడ్డి

సభలను అడ్డుకోవడాన్ని సమర్థించం: విజయసాయి రెడ్డి

విపక్షాలు పార్లమెంట్‌ను స్తంభింపజేయడంపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ను సజావుగా జరగకుండా అడ్డుకోవడం ఏమాత్రం సరికాదని అన్నారు. ఈ విషయాన్ని వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో సమర్థించడదని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. మణిపూర్ అంశంపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా చర్చకు అంగీకరించారని…సమాధానం చెప్తామని ప్రకటించినప్పటికీ విపక్షాలు పార్లమెంట్‌ను స్తంభింపజేయడంపై విమర్శలు గుప్పించారు. మణిపూర్ దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశమని.. ఇది పూర్తిగా కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటుందని విజయసాయిరెడ్డి చెప్పుకొచక్చారు. ఇలాంటి సమయంలో ఉభయ సభలను నిలిపివేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.