* భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారం
పుణెలో ఓ దారుణం చోటు చేసుకుంది. అవసరాల కోసం ఓ వ్యక్తి దగ్గర తీసుకున్న రుణమే తన కుటుంబానికి శాపంగా మారిందని ఓ బాధితుడు పోలీసుల ఎదుట గోడు వెల్లబోసుకున్నాడు. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం. పుణెలోని హడప్సర్ లోని కాలనీలో ఓ దంపతులు నివసిస్తున్నారు. అవసరాల కోసం కొంత డబ్బును ఇంతియాజ్ షేక్ అనే వ్యక్తి దగ్గర తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తీసుకున్న అప్పును చెల్లించలేదు. తన అప్పు తిరిగి చెల్లించాల్సిందేనంటూ వారిని షేక్ వేధింపులకు గురిచేశాడు. సొమ్మును తిరిగి ఇవ్వాలంటూ భర్తను కత్తితో బెదిరించి అతని కళ్లెదుటే పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ఎదుర్కొవడంతో వాటిని వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతడి ఆగడాలను భరించలేని దంపతులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని అతడిని అరెస్టు చేశారు.
* ఈ ఏడాది 782 సైబర్ క్రైం కేసులు
టెలిగ్రాం, వాట్సాప్ అడ్డాగా రూ.712 కోట్లు దోచేసిన చైనీస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసులో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల డేటాను సేకరిస్తున్నారు. సిటీ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది ఆరు నెలల్లో 782 ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసులు నమోదైనట్లు గుర్తించారు. వాటిలో సైబర్ నేరస్తులు రూ.48 కోట్లకు పైగా కొల్లగొట్టారు. ఈ క్రమంలోనే రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లు పరిధిలో రోజూ 30 పైగా కేసులు రిపోర్ట్ అవుతున్నాయని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, పార్ట్ టైమ్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం పేరుతో జరిగిన సైబర్ మోసాలకు సంబంధించిన కేసుల డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. సైబర్ నేరాల్లో బాధితుల ఫిర్యాదుల ఆధారంగా వారి డబ్బు ట్రాన్స్‌ఫర్ అయిన బ్యాంకు ఖాతాల వివరాలు రాబడుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రకాశ్ ప్రజాపతి ఆపరేట్ చేస్తున్న అకౌంట్ల లింకులను గుర్తించారు. షెల్ కంపెనీల పేర్లతో ఓపెన్ చేసిన113 ఖాతాల్లో అకౌంట్స్‌లో జరిగిన ట్రాన్సాక్షన్ సేకరిస్తున్నారు.ఇందుకోసం సంబంధిత బ్యాంకులకు లెటర్లు రాశారు. చైనీస్, దుబాయ్ గ్యాంగ్స్‌ను అరెస్టు చేసేందుకు కేంద్ర ఏజెన్సీలకు సమాచారం అందించారు.హిందీ మాట్లాడేవారు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలనే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ఢిల్లీ, బెంగాల్, యూపీల్లో పలు నగరాలను కేంద్రంగా చేసుకొని కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. నిరుద్యోగ యువతకు కమీషన్లు, గిఫ్ట్‌లతో ఆఫర్లు ఇస్తున్నారు. వారితో లింక్స్ పంపించి ఇన్వెస్ట్‌మెంట్, జాబ్ ఫ్రాడ్స్‌తో అందిన కాడికి దోచేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం తెలిస్తే చాలు కాల్ సెంటర్ ఉద్యోగులకు ఇచ్చినట్లు ప్రొఫెషనల్ వర్క్ ఇస్తున్నారు. సైబర్ నేరగాళ్లు అమాయకుల ఆశను క్యాష్ చేసుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు, కమీషన్ ఇస్తామంటూ ట్రాప్ చేస్తున్నారు. ఇలాంటివి రోజూ 15 నుంచి 20 కేసులు నమోదు అవుతున్నాయి. బాధితులు రూ.కోట్లలో నష్టపోతున్నారు. పోగొట్టున్న డబ్బు రికవరీ అయ్యే అవకాశాలు లేవు. ప్రజల్లో అవగాహనతోనే సైబర్ నేరాలను నివారించగలం.
* కారు ఢీకొట్టడంతో అమాంతం గాల్లోకి ఎగిరిపడిన విద్యార్థినులు
రోడ్డుపై ప్రయాణించేప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి వ్యక్తులు తమతోపాటు.. ఇతరులను ప్రమాదంలోకి నెట్టేస్తారు. తాజాగా కర్ణాటక (Karnataka)లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదమే అందుకు ఉదాహరణ. రాయ్‌చూర్ జిల్లాలో బైకర్ నిర్లక్ష్యం కారణంగా వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న పాఠశాల విద్యార్థినులను వెనుక నుంచి ఢీకొట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రాయ్‌చూర్ (Raichur)లోని రాఘవేంద్ర పెట్రోల్ బంక్ సమీపంలో చోటుచేసుకున్న ప్రమాద వివరాలిలా ఉన్నాయి. రోడ్డుపై ఒక కారు వేగంగా వస్తుండగా.. అవతలివైపు నుంచి బైక్‌పై వస్తున్న వ్యక్తి సడెన్‌గా యూటర్న్ తీసుకుని రోడ్డు మధ్యలోకి వచ్చాడు. దీంతో కారు వేగాన్ని అదుపుచేయలేక డ్రైవర్.. బైక్‌ను ఢీకొట్టి, పక్కనే రోడ్డుపై నడుస్తున్న నలుగురు విద్యార్థినులపై దూసుకెళ్లాడు. ఈ ఘటనలో బైక్ పైనున్న వ్యక్తి అమాంతం గాల్లోకి ఎగిరిపడిపోయాడు. వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ఒక విద్యార్థిని పక్కకు పడిపోగా.. మరో విద్యార్థిని గాల్లోకి ఎగిరి కొంత దూరంలో పడిపోయింది.ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, ఇద్దరు విద్యార్థినులకు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* నిందితుల్ని పట్టించిన బీర్ బాటిల్ మూత
ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి కేసులో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సీసీటీవీ కెమెరాల్లోనూ వారి కదలికలు కనిపించలేదు. దీంతో.. నిందితుల్ని ఎలా పసిగట్టాలన్నది పోలీసులకు పెద్ద మిస్టరీగా మారింది. అప్పుడే వారికి బీర్ సీసా మూత ఒకటి దొరికింది. అదే ఈ కేసులో ప్రధాన ఆధారంగా అవతరించింది. దాని కోణంలో అధికారులు విచారణ చేపట్టగా.. చివరికి నిందితులు దొరికిపోయారు. అసలేం జరిగిందంటే.. జులై 16వ తేదీన బెంగళూరులోని మిలీనియం బార్ వద్ద మిథున్‌రాజ్, ముత్తురాజ్ అనే స్నేహితులు ఒక ఆటోలో కూర్చున్నారు. ఆటోలో పాటలు పెట్టుకొని, సరదాగా మాట్లాడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.అప్పుడు నలుగురు వ్యక్తులు సడెన్‌గా ఆ ఇద్దరి వద్దకు వచ్చి, బీర్ బాటిళ్లతో వారిపై దాడి చేశారు. అనంతరం ఆ నిందితులు తమ బైక్‌ల్లో అక్కడి నుంచి పారిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుల్ని స్థానికులు గమనించి, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే.. మొదట్లో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. చివరికి సీసీటీవీ కెమెరాలు పరిశీలించినా.. అందులో నిందితుల కదిలికలు లేవు. దీంతో మళ్లీ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు.. అక్కడ ఒక బీర్ బాటిల్ మూత దొరికింది. దానిపై బ్యాచ్ నంబర్ ఉండటంతో.. దాని ఆధారంగా బార్ ఆచూకీ కనుగొన్నారు. ఆ బార్ వద్దకు వెళ్లి చూడగా, అక్కడ సీసీటీవీ కెమెరాలు కనిపించాయి. వాటిని పరిశీలించగా.. నిందితులు బీర్లు కొనుగోలు చేసి, బైక్‌లో వెళుతున్న దృశ్యాలు కనిపించాయి.
* భార్య, అత్తమామలను చంపిన భర్త
కొవిడ్ లాక్ డౌన్ లో వికసించిన ఓ ప్రేమ కథ విషాదాంతంగా ముగిసింది. ఓ భర్త తన భార్య, అత్తమామను హత్య చేసి 9 నెలల పాపతో చివరకు పోలీస్ స్టేషన్లో లొంగిపోవడంతో కథ కంచికి చేరింది. ఈ లవ్ స్టోరీ కం, ముగ్గురి మర్డర్ స్టోరీ అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో జరిగింది.అసలేం జరిగిందంటే.. 2020 జూన్ లో దేశ వ్యాప్తంగా కొవిడ్ లాక్ డౌన్ సమయంలో నజీబుర్ రెహమాన్ బోరా అనే మెకానికల్ ఇంజినీర్(25)కు సంఘమిత్ర(24)అనే అమ్మాయితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది.. నెలలోపే ఈ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి అదే ఏడాది అక్టోబర్ లో కోల్ కతాకు పారిపోయారు. ఈ విషయం తెలిసిన సంఘమిత్ర తల్లిదండ్రులు సంజీవ్, జును ఘోష్ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆమె అప్పటికే కోల్ కతాలోని కోర్టులో నజీబుర్ ను పెళ్లి చేసుకుంది. 2021లో సంఘమిత్రపై ఆమె తల్లిదండ్రులు దొంగతనం కేసు పెట్టారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నెలపాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. తర్వాత బెయిల్ పై వచ్చిన సంఘమిత్ర తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అక్కడే ఉంటుంది.
* ఐదేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్ లో అత్యంత హేయనీయమైన ఘటన వెలుగు చూసింది. చిన్నా,పెద్దా తేడా లేకుండా మహిళ అయితే చాలు కామంధులు రెచ్చిపోతున్నారు. వావివరసలు, ఉచ్ఛనీచాలు మరిచి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దొరికిపోతామన్న భయంతో ఆ తర్వాత చేసే ఘోరాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటున్నాయి. ఇలాంటి ఘటనలను అరికట్టడానికి ఎన్ని కఠినమైన చర్యలు తీసుకుంటున్నా… ఫలితం లేకుండా పోతోంది.ఉత్తరప్రదేశ్లో ఐదేళ్ల బాలికపై ముగ్గురు దుర్మార్గులు దాని గ్యాంగ్ రేప్ పాల్పడ్డారు. దారుణమైన ఈ ఘటనలో బాలిక స్పృహ కోల్పోగా చనిపోయిందనుకొని బ్రతికుండగానే మట్టిలో పాతిపెట్టేశారు. ఉత్తరప్రదేశ్ లోని బారాబాంకీ జిల్లా రాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణమైన ఘటన వెలుగు చూసింది.ఐదేళ్ల చిన్నారి ఇంటిముందు ఆడుకుంటుందని ఆమె తల్లి చెప్పింది. అదే సమయంలో అక్కడికి రింకూ, లవ్ కుశ్, అమ్రేష్ అనే ముగ్గురు యువకులు వచ్చారు. చిన్నారికి ఏవో మాయమాటలు చెప్పి అక్కడి నుంచి ఆమెని తమతో పాటు తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు.ఆ తర్వాత చిన్నారి చనిపోయిందనుకొని.. అక్కడే మట్టిలో పాతిపెట్టి ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. ఇంటి ముందు ఆడుకుంటున్న కూతురు కనిపించకపోవడంతో తల్లి అంతటా వెతికింది. ఎక్కడా కూతురి ఆచూకీ లభించలేదు. దీంతో ఏమి చేయలేని పరిస్థితుల్లో తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకి ముగ్గురు యువకులు బాలికను తీసుకువెళ్లినట్లుగా తెలిసింది.
* జేసీబీతో ఏటీఎంపై దాడి
అర్ధరాత్రి.. నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యం. పెద్ద ప్రొక్లెయినర్‌తో కొందరు వచ్చారు. వెంటనే ఏటీఎం ముందు నిలిపి నగదు యంత్రాన్ని పెకలించడంలో నిమగ్నమయ్యారు. ఇది సినిమా షూటింగ్ కాదు.. నిజంగా జరిగినదే. జేసీబీ సాయంతో ఏటీఎం యంత్రాన్ని తొలగించి డబ్బులు దొంగిలించేందుకు దొంగలు విశ్వప్రయత్నాలు చేశారు. ఈ వినూత్న సంఘటన శివమొగ్గ నగరంలోని వినోబా నగరలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది.వివరాలు.. 100 అడుగుల రోడ్డు శివాలయం ఎదురుగా ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎం సెంటర్ ఉంది. సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గత కొన్ని రోజుల నుంచి ఒక జేసీబీ వాహనం మరమ్మతుల వల్ల నిలిచి ఉంది. దొంగలు నకిలీ తాళాలను ఉపయోగించి ఈ జేసీబీని స్టార్ట్ చేశారు. తరువాత ఏటీఎం వద్దకెళ్లి దానిని పెకలించే పనిలో పడ్డారు. ఇంతలో అదే రోడ్డులో ట్రాఫిక్ సీఐ సంతోష్ కుమార్‌తో కూడిన గస్తీ వాహనం వచ్చింది.జేసీబీతో ఏటీఎం వద్ద ఏం చేస్తున్నారని దుండగులను సీఐ ప్రశ్నించారు. దీంతో దుండగులు జేసీబీని వదిలి పారిపోయారు. వినోబనగర పోలీసులు వచ్చి పరిశీలించారు. ఏటీఎం పైభాగం పూర్తి ధ్వంసమైంది. అక్కడి సీసీ కెమెరాల్లో దొంగతనం దృశ్యాలు రికార్డయ్యాయి. దొంగల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
* భారీ వర్షాలు: పిడుగుపాటుతో ఐదుగురు మృతి
మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో పిడుగుపాటుకు గురైన ఐదుగురు మృతి చెందారు. భారీ వర్షాల మధ్య మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో వేర్వేరు పిడుగుపాటు ఘటనల్లో ఐదుగురు మృతి చెందారనీ, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మరికొన్నిరోజులు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది.వివరాల్లోకెళ్తే.. రాష్ట్రంలోని చంద్రాపూర్ జిల్లాలో పిడుగుపాటుకు సంబంధించిన నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాల మధ్య ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. చంద్రాపూర్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బ్రహ్మపురిలో ఉన్న బేతాలా గ్రామంలో గీతా డోంగే అనే 45 ఏళ్ల మహిళ పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగు పడింది. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరో ఘటనలో కల్పనా ప్రకాశ్ జోడే, శ్రీమతి పరసోడే అనే ఇద్దరు మహిళలు సింధేవాహి తహసీల్ పొలాల్లో పని చేస్తుండగా పిడుగు పడింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.కోర్పానా తాలూకాలోని ఖైర్గావ్ లో పురుషోత్తమ్ పరాచకే అనే 25 ఏళ్ల రైతు తన పొలంలో పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. నాల్గవ సంఘటన గోండిపారి తాలూకా చివండాలో జరిగింది. ఇక్కడ గోవింద టేకం అనే అటవీ కార్మికుడు అటవీ శాఖలో చెట్ల పెంపకం పనులు చేస్తుండగా పిడుగు పడటంతో మరణించాడు. మరోవైపు పిడుగుపాటు కేసుల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
* తప్పతాగి, తరగతి గదిలో విద్యార్థుల ముందు నగ్నంగా పడుకున్న హెడ్మాస్టర్
ప్రధానోపాధ్యాయుడు అంటే మిగతా ఉపాధ్యాయులకు, స్కూల్ లోని విద్యార్థులకు.. వారి తల్లిదండ్రులకు తన ప్రవర్తనతో ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. అలాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఓ ప్రధానోపాధ్యాయుడు బాధ్యత తప్పి వ్యవహరించాడు. స్కూల్ కి తప్పతాగి, ఒంటిమీద సోయి లేకుండా వచ్చాడు. ఆ తరువాత తరగతి గదిలోనే.. మద్యం మత్తులో.. ఒంటిపై ఏ మాత్రం సోయి, సుద్దు లేకుండా నగ్నంగా నిద్రపోయాడు.ఇది చూసిన మిగతావారు ఉన్నతాధికారులకు విషయాన్ని తెలపడంతో.. ఆ హెడ్మాస్టర్ ని సస్పెండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని బహ్రెచ్ జిల్లాలోని శివపూర్ బైరాగి ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ స్కూల్లో హెడ్మాస్టర్ గా దుర్గాప్రసాద్ జైస్వాల్ అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి మద్యం తాగే అలవాటుంది. కొద్ది రోజుల క్రితం తప్పతాగి స్కూల్ కి వచ్చాడు.ఆ సమయంలో స్కూల్లో తరగతి గదుల్లో టీచర్లు పాఠాలు చెబుతున్నారు. ఓ తరగతి గదిలోకి వెళ్లిన ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల ముందే దుస్తులన్నీ విప్పేశాడు. అక్కడే నగ్నంగా నిద్రపోయాడు. ఇది విద్యార్థులు తల్లిదండ్రులకు తెలపడంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు… దీన్నంతా వీడియో తీశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. వెంటనే వారు ప్రధానోపాధ్యాయుడుపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేశారు. హెడ్మాస్టర్ ప్రవర్తన మీద విద్యార్థులు తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. అతను ఇలా చేయడం మొదటిసారి కాదని తరచుగా ఇలాగే చేస్తున్నాడని ఆరోపించారు. ప్రధానోపాధ్యాయుడి ఈ చేష్టలతో విసిగిపోయిన కొంతమంది అమ్మాయిలు స్కూలుకు వెళ్లడం మానేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
* ఓ వ్యక్తి పై పెట్రోల్ పోసి నిప్పంటించిన కుటుంబ సభ్యులు
తెలంగాణాలో క్రైం రేటు రోజురోజుకు పెరిగిపోతుంది.. మొన్నటివరకు రోడ్డు ప్రమాదాలతో జనాలు అనేక ఇబ్బందులు పడితే.. నేడు హత్యలు కలకలం రేపుతున్నాయి.. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరగడం వల్లో కుటుంబ కలహాల వల్లనో హత్యకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుందని తెలుస్తుంది.. క్షనీకావేశంలో జరిగే హత్యలతో కుటుంబాలు విచ్చిన్నం అవుతాయి.. తాజాగా పెద్దపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది.. నిద్రిస్తున్న ఓ వ్యక్తి పై కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసి అతి కిరాతాకంగా సజీవ దహనం చేశారు.. ఈ దారుణ ఘటన తాజాగా వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి దారుణ హత్య గావించబడ్డారు. ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గాలిపెళ్లి అశోక్ దారుణ హత్యకు గురయ్యాడు.. మృతుడు అశోక్ బావ, తమ్ముడు, చెల్లెలు అర్ధరాత్రి గదికి బయట లాక్ చేసి ఇంటి వెనకాల కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లుగా బంధువులు వెల్లడించారు. అశోక్ ను గత 10 రోజుల క్రితమే హత్య చేయడానికి ప్రయత్నం చేశారని, ప్రాణ భయం ఉందని పోలీస్ స్టేషన్ లో అశోక్ ఫిర్యాదు చేశారు.అశోక్ హత్యను తన కుటుంబ సభ్యులే చేసినట్లు తెలుస్తుంది.. మృతుడు అశోక్ బావ, తమ్ముడు, చెల్లెలు అర్ధరాత్రి గదికి బయట లాక్ చేసి ఇంటి వెనకాల కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లుగా బంధువులు వెల్లడించారు. అతను పది రోజుల క్రితమే బావ, తమ్ముడు, చెల్లెలు పథకం ప్రకారం హత్య చేశారని గ్రామస్తులు అంటున్నారు. అశోక్ మృతికి అస్తి పంపకాలే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అశోక్ బావ అనిల్, తమ్ముడు నరేష్, చెల్లెల్లు పుష్పలతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. ఈ దారుణ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.