Politics

అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దు

అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దు

బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన మరోసారి రద్దయింది. భారీ వర్షాల కారణంగా ఈ నెల 29న(శనివారం) తెలంగాణ పర్యటనను రద్దుచేసుకున్నారు అమిత్‌షా. తెలంగాణ పర్యటన మళ్లీ ఎప్పుడన్నది త్వరలో ప్రకటిస్తామని తెలిపింది బీజేపీ. తెలంగాణలో పార్టీ విస్తరణ పనుల్లో భాగంగా అమిత్ షా పర్యటనకు కమలం నాయకులు ప్లాన్ చేశారు. వివిధ రంగాల్లోని ప్రముఖులను కలవడంతోపాటు పార్టీలోకి పలువురు నేతలకు చేర్చుకునేందుకు వ్యూహం రచించారు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటిచారు బీజేపీ రాష్ట్ర నాయకులు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి అగ్రనేతలను రాష్ట్రానికి రప్పించనున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌ ఇటీవల జరిగిన అలర్లలో జైలుకెళ్లిన బాధితులను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పరామర్శించారు. శివాజీ విగ్రహాన్ని అవమానించిన వారిని అడ్డుకుంటే తమ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని కిషన్‌రెడ్డి ఆరోపించారు మజ్లిస్‌ పార్టీ అండ ఉంటే తిరిగి అధికారంలోకి వస్తామనే ఆలోచనలో బీజేపీ ఉందని ఆరోపించారు.పోలీసు కేసులతో తమను భయపెట్టాలని చూస్తే తాము బెదిరిపోమని అన్నారు. కిషన్‌రెడ్డి వెంట దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు కూడా బాధితులను పరామర్శించారు.