WorldWonders

ఈ రెస్టారెంట్‌లో భోజనం చేయాలంటే నాలుగేళ్లు ఆగాల్సిందే

ఈ రెస్టారెంట్‌లో భోజనం చేయాలంటే నాలుగేళ్లు ఆగాల్సిందే

మంచి రెస్టారెంట్‌లో భోజనం చేయాలంటే ఒకటి లేదా రెండు రోజుల ముందుగా టేబుల్‌ బుక్‌ చేసుకోవడం సాధారణంగా చూస్తుంటాం. కానీ, యూకే (UK)లోని బ్రిస్టల్‌ ( Bristol)లో ఉన్న ‘ది బ్యాంక్‌ టావెర్న్‌’ అనే చిన్న పబ్‌లో మాత్రం ఆదివారం ఆహారాన్ని ఆస్వాదించడం అంత సులువు కాదు. ఎందుకంటే.. ఈ పబ్‌లో ప్రత్యేకంగా సిద్ధం చేసే ‘సండే రోస్ట్‌లు’ (Sunday roasts) కోసం నాలుగేళ్ల వేచి ఉండాలట.డోజీలోని రెస్టారెంట్‌ బుకింగ్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణులు యూకేలోనే సుదీర్ఘ వెయిటింగ్‌ లిస్టు ఉన్న పబ్‌గా దీన్ని గుర్తించారు. కొవిడ్‌ సమయంలో దేశవ్యాప్తంగా చాలా పబ్‌లు, రెస్టారెంట్లను మూసివేయాల్సి వచ్చింది. ఫలితంగా ఈ పబ్‌లో ‘సండే రోస్ట్‌ల’ కోసం జరిగిన ముందస్తు బుకింగ్స్‌ వెయిటింగ్‌ లిస్ట్‌ మరింత పెరిగింది. ఇప్పుడు వీటిని ఆస్వాదించడానికి నాలుగేళ్లు వేచి చూడాల్సిందే.

‘సండే రోస్ట్‌ల’ ప్రత్యేకత..ఈ రోస్టుల్లో బీఫ్‌, పోర్క్‌ బెల్లీ, ల్యాంబ్‌, దినుసులతో కూడిన ప్రత్యేకమైన వంటకాలను వడ్డిస్తారు. వీటి కోసం చాలా మంది ముందుగా బుక్‌ చేసుకుంటారు. 2018లో బ్రిస్టల్‌ గుడ్‌ ఫుడ్‌ అవార్డ్స్‌లో ఉత్తమ సండే లంచ్‌గా ఎంపికైంది. 2019లో అబ్జర్వర్‌ ఫుడ్‌ మంత్లీ అవార్డును గెలుచుకుంది. ఇలా ఎన్నో అవార్డులను సొంతం చేసుకొంది. ఈ పబ్‌ 19వ శతాబ్దం నాటిది.