DailyDose

వర్షాల సమయంలో జీబ్రా లైన్ దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండండి..ఎందుకంటే?

వర్షాల సమయంలో జీబ్రా లైన్ దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండండి..ఎందుకంటే?

రోడ్లపై జీబ్రా లైన్ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనిపై నుంచి నడిచి వెళ్లే వాళ్లు రోడ్లు దాటుతుంటారు. అయితే ఈ జీబ్రా లైన్స్ కారణంగా వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఉంది. అదేలా అనుకుంటున్నారా..?వర్షాకాలంలో జీబ్రా లైన్ క్రాసింగ్ చేసేటప్పుడు దానిపై ఉండే తెల్లటి పెయింట్ ఉపరితలంపై అడుగు పెట్టగానే జారుడు స్వభావం కలిగి ఉంటుంది. ఎందుకంటే అది పెయింట్ కాదు. అది వైట్ సిరమిక్ పౌడర్ పెయింట్. అది ఉపయోగించినప్పుడు అధిక ఉష్ణోగ్రత ద్వారా బయటకు వస్తుంది. శీతలీకరణ తర్వాత అది నేలపై పటిష్టం అవుతుంది. అంతే కాకుండా వర్షం పడినప్పుడు చాలా జారుతూ ఉంటుంది. కాబట్టి వర్షాలు పడినప్పుడు జీబ్రా లైన్ దాటి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా, స్లోగా వెళ్లడం ఎంతైనా మంచిది.