సెప్టెంబరు 5 నుంచి భారత్ జోడో యాత్ర 2.0 ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర 2.0 చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 5 నుంచి రెండో విడత పాదయాత్రను చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.గుజరాత్ లోని పోరుబందర్ నుంచి త్రిపుర రాజధాని అగర్తల వరకు ఈ యాత్ర సాగనున్నట్లు సమాచారం. తొలివిడత భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు విజయవంతంగా సాగి … పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. కాగా, గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర చాలా విజయవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే.