ప్రజా గాయకుడు గద్దర్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. గద్దర్ చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి పవన్ వెళ్లారు. గద్దర్ ను కలుసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. పవన్ రాకతో గద్దర్ ముఖంలో ఉత్సాహం కనిపించింది. జనసేనాని ఆయనను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని పవన్… గద్దర్ కు సూచించారు. గద్దర్ ఏ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారన్నది తెలియరాలేదు.