తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ పోస్టర్ల కలకలం రేపాయి. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కనబడుటలేదని నియోజకవర్గంలో వెలిశాయి పోస్టర్లు. 2020 వరదలు వచ్చినప్పుడు రాలేదు, 2023లో వర్షాలు వస్తున్న రాలేదు అంటూ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.ఇక ఈ పోస్టర్లపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహిస్తున్నారు. ఇది బీఆర్‌ఎస్ పార్టీ నేతల పని అంటూ ఫైర్ అవుతున్నారు. కాగా, హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముట్టడి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే.. వేల సంఖ్యంగా హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ముట్టించేందుకు ప్రయత్నం చేశారు.