దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలను చవి చూశాయి. అమెరికా మార్కెట్లు బలహీనంగా ఉండటం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 66,160కి పడిపోయింది. నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయి 19,646 వద్ద స్థిరపడింది.