Politics

GHMC ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

GHMC ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జీహెచ్ఎంసీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. వరద బాధితుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ముట్టడి కార్యక్రమం చేపట్టింది. గన్ పార్క్ నుంచి భారీ ర్యాలీగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కు వినతిప్రం ఇస్తామని చెప్పగా లోపలికి వెళ్లేందుకు కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం మొదలైంది.కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని అదుపులోకి తీసుకుని నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. హైదరాబాద్ ప్రజలు వరదలతో అల్లాడుతుంటే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ అంటోంది. బాధితులకు రూ.10 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.