Politics

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో ఐఏఎస్ అధికారులతో పాటు జాయింట్ కలెక్టర్లను, ఇతర ముఖ్య విభాగాల్లోనూ అధికారులను బదిలీ చేయడం జరిగింది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తంగా ఏడుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. కోనసీమ‌ జిల్లా జాయింట్ కలెక్టర్ గా శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, హార్టికల్చర్ మరియు సెరికల్చర్ డైరక్టర్ గా గంధం చంద్రుడు, విలేజ్ వార్డు సెక్రటేరియట్ అదనపు డైరక్టర్ గా ధ్యానచంద్ర లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.