NRI-NRT

హెచ్‌1బీ రెండో విడత లాటరీ ఎప్పుడో?

హెచ్‌1బీ రెండో విడత లాటరీ ఎప్పుడో?

2024 ఆర్థిక సంవత్సరానికి గానూ హెచ్‌1బీ వీసాల జారీకి త్వరలోనే రెండో విడత లాటరీని నిర్వహిస్తామని అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) శుక్రవారం వెల్లడించింది. తొలి విడత లాటరీని ఈ ఏడాది మార్చిలో నిర్వహించారు. ‘2024 ఏడాదికి సంబంధించి హెచ్‌1బీ వీసా కోటాను పూర్తిచేసేందుకు మరిన్ని దరఖాస్తులను ఎంపికచేయనున్నాం. ఇదివరకే దరఖాస్తు చేసిన ఎలక్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్స్‌ నుంచి లాటరీ విధానంలో వీటిని ఎంపికచేస్తాం’ అని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది.హెచ్‌1బీ వీసా అనేది నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా. విదేశాలకు చెందిన నిపుణులైన ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు ఈ వీసా వీలు కల్పిస్తుంది. భారత్‌, చైనాకు చెందిన ఐటీ నిపుణులు ఈ వీసా కోసం ఎక్కువగా పోటీపడుతుంటారు. యూఎస్‌సీఐసీ ఏటా 85000 హెచ్‌1బీ వీసాలను జారీచేస్తుంది. రెండో విడత లాటరీ ఎప్పుడు నిర్వహించబోయేదీ యూఎస్‌సీఐఎస్‌ స్పష్టంగా చెప్పనప్పటికీ, వచ్చే నెలలో లాటరీ నిర్వహించే అవకాశం ఉన్నదని సమాచారం.