NRI-NRT

TANA: ఒహాయోలో ప్రవాస మహిళల క్రికెట్ పోటీలు

TANA: ఒహాయోలో ప్రవాస మహిళల క్రికెట్ పోటీలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఒహాయో వ్యాలీ టి7 క్రికెట్‌ టోర్నమెంట్‌ మరియు టి5 ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆగస్టు 5వ తేదీన నిర్వహిస్తున్నామని తానా క్రీడా విభాగ సమన్వయకర్త పంచుమర్తి నాగ తెలిపారు. కొలంబస్‌లో జరిగే ఈ పోటీలు ఉదయం 7.30 నుంచి ప్రారంభమవుతాయి. తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు, తానా ఫౌండేషన్‌ ట్రస్టీ రవి సామినేని, తానా ఒహాయో వ్యాలీ రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ శివ చావా ఈ పోటీల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విజేతలకు బహుమతులు అందజేస్తారు. వేణు చావా, వంశీ మద్దులూరి, సిద్దార్థ రేవూర్‌, శ్రీకాంత్‌ మునగాల ఈ పోటీల విజయవంతానికి కృషి చేస్తున్నారు.

Womens And Mens Cricket Tournament in Ohio By TANA
Womens And Mens Cricket Tournament in Ohio By TANA