Food

ఇంట్లో ఉల్లిపాయలు కుళ్లిపోకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

ఇంట్లో ఉల్లిపాయలు కుళ్లిపోకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

సాధారణంగా ఉల్లిపాయలు ఎక్కువ కాలమే నిల్వ ఉంటాయి. కానీ వాటిని నిల్వ చేసే విధానం సరిగ్గా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా అవి కుళ్లిపోతాయి. అందుకే ఈ రోజు ఉల్లిపాయలను నిల్వ చేసుకొనే విధానం గురించి తెలుసుకుందాం.ఉల్లిపాయ లేదా ఉల్లిగడ్డ లేని వంట గదిని ఊహించలేం. ప్రతి కూరలోనూ అది ఉండాల్సిందే. అది వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా ఏదైనా తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకే వాటిని ఎక్కువ మొత్తంలో ఒకేసారి ఇంట్లో తెచ్చి పడేస్తారు. అలాంటప్పుడు వాటిని పాడవకుండా కాపాడుకోవడం చాలా అవసరం. సాధారణంగా ఉల్లిపాయలు ఎక్కువ కాలమే నిల్వ ఉంటాయి. కానీ వాటిని నిల్వ చేసే విధానం సరిగ్గా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా అవి కుళ్లిపోతాయి. అందుకే ఈ రోజు ఉల్లిపాయలను నిల్వ చేసుకొనే విధానం గురించి తెలుసుకుందాం. ఉల్లిని ఎలా నిల్వ చేయాలి? అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వంట గది టిప్స్ ఏంటి? వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

మంచి ఉల్లిపాయలను ఎంచుకోవాలి.. మీరు ఉల్లి కొనేముందే వాటి నాణ్యతను పరిశీలించాలి. అవి గట్టిగా, పొడిగా ఎటువంటి దెబ్బలు లేకుండా, మెత్తటి మచ్చలు వంటివి లేకుండా ఉండే వాటిని ఎంచుకోవాలి. ఏదైనా నష్టం కలిగించే విధంగా ఉండే కాయలను మీరు ఎంచుకోవద్దు. ఎందుకంటే అవి త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉంది

చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయండి.. ఉల్లిపాయలు కుళ్లిపోవడానికి దారితీసేది తేమ. ఈ తేమను నిరోధించడానికి చల్లని పొడి వాతావరణంలో నిల్వ చేయాలి. మీ చిన్నగది లేదా వంటగదిలో మంచి గాలి ప్రవహించే ప్రదేశంలో వీటిని నిల్వ చేయాలి. అలాగే వేడి, ప్రత్యక్ష సూర్యకాంతి పడకుండా ఉండేలా చూసుకోవాలి.