Politics

మరో 3వేల కోట్లు అప్పు ఆర్బీఐ నుంచి సమీకరించనున్న ప్రభుత్వం

మరో 3వేల కోట్లు అప్పు  ఆర్బీఐ నుంచి సమీకరించనున్న ప్రభుత్వం

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3 వేల కోట్లు ఆర్.బి.ఐ నుంచి అప్పుగా తీసుకోనుంది. ఆగస్టు 1న ఆర్బిఐ నిర్వహించే సెక్యూరిటీ వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకొనున్నట్లు సమాచారం. ఈ ఏడాది FRBM కింద ఏపీ రూ. 30 వేల 500 కోట్ల వరకు తీసుకునే అనుమతి ఉంది.ఇది ఇలా ఉండగా.. అబద్దాలు చెబితే లోకేష్ లాంటి కొడుకు పుడతాడంటూ అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు. 1998 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు చంద్రబాబు ఎందుకు పోలవరం గురించి ఆలోచించ లేదు?? అని మండిపడ్డారు. ప్రాజెక్టుల పై చిత్తశుద్ధి లేని వ్యక్తి అని.. గాలేరు-నగరి ప్రాజెక్టును ఎందుకు పట్టించుకో లేదని మండిపడ్డారు.