DailyDose

విమానంలో వైద్యురాలిపై లైంగిక వేధింపులు-TNI నేటి నేర వార్తలు

విమానంలో వైద్యురాలిపై లైంగిక వేధింపులు-TNI నేటి నేర వార్తలు

విమానంలో వైద్యురాలిపై లైంగిక వేధింపులు

విమానంలో ఓ వైద్యురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రొఫెసర్‌ను ముంబయి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. దిల్లీ- ముంబయి విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం దిల్లీ నుంచి బయలుదేరిన విమానం ముంబయి విమానాశ్రయంలో దిగడానికి ముందు తన పక్క సీటులో కూర్చున్న ఓ ప్రొఫెసర్‌ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని, తనను తాకాడని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంత సేపు తమ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు శుక్రవారం నిందితుడైన ప్రొఫెసర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.  కోర్టులో హాజరుపర్చగా.. అతడికి బెయిల్‌ మంజూరైందని.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సహార్‌ పోలీసులు తెలిపారు.

కడప జిల్లాలో దారుణం

 కడప జిల్లా బద్వేల్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానిక స్వప్న బార్ నిర్వాహకులు ఇద్దరు వ్యక్తులపై దౌర్జన్యం ప్రదర్శించారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరిని బార్ నుంచి రోడ్డు మీదికి లాగేశారు. ఆ తరువాత నడిరోడ్డుపై విచక్షణారహితంగా వారిని కొట్టారు బార్ సిబ్బంది. ఈ ఘటనను సెల్ఫోన్లో వీడియోలు తీస్తున్న వారి మీద కూడా దాడి చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

*  బాణాసంచా గోదాంలో పేలుడు

స్థానికుల సమాచారంతో పోలీసుల, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని.. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. వీలైనంత త్వరగా ఘటన ఎలా జరిగిందో తెలుసుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

పెళ్లికి నిరాకరించిందని యువతి హత్య

పట్టపగలే పార్కులో ఓ యువతిని దారుణంగా హత్య చేశాడో యువకుడు. ఈ ఘటన దిల్లీ మాలవీయనగర్‌లో  జరిగింది. తనతో పెళ్లికి నిరాకరించిందన్నకారణంతో యువతిని ఇనుప రాడ్డుతో తలపై కొట్టిన అనంతరం ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువతి సమీపంలో పడి ఉన్న ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇర్ఫాన్‌ (28) డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇర్ఫాన్‌ బంధువైన నర్గీస్‌ (22) దిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటోంది. తనను పెళ్లి చేసుకోవాలంటూ యువతిని ఇర్ఫాన్‌ వేధించేవాడు. ఈ విషయం యువతి ఇంట్లో చెప్పగా.. ఉద్యోగం లేదన్న కారణంతో ఇర్ఫాన్‌తో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన నిందితుడు.. పార్క్‌లో కూర్చున్న యువతిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.  సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

*  గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్ అనుచరుడు

ఫిదా హుస్సేన్ షేక్ ఛోటా షకీల్ గ్యాంగ్ షూటర్..  జూలై 28న థానే రైల్వే స్టేషన్ సమీపంలో పైడోనీ పోలీసులు అరెస్టు చేశారు. అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ గ్యాంగ్ సభ్యుడి హత్య  కేసులో షేక్ నిందితుడు అని అధికారి తెలిపారు.1997 ఏప్రిల్ 2 సాయంత్రం అరెస్టయిన అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ముఠా సభ్యుడు మున్నా ధారిని నిందితుడు అతని సహచరులతో కలిసి కాల్చి చంపారు. ఆ సమయంలో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి షేక్‌ను అరెస్టు చేశారు. IPC సెక్షన్ 302, 34, ఆయుధ చట్టంలోని సెక్షన్ 3, 25 కింద కేసు నమోదు చేశామని అధికారి తెలిపారు.1998లో హుస్సేన్ షేక్ కోర్టు బెయిల్‌పై విడుదలయ్యాడు. 1998 నుంచి షేక్‌ అండర్‌గ్రౌండ్‌కి వెళ్లాడని, ఎలాంటి కోర్టు విచారణకు హాజరుకాలేదని, ఈ కేసులో అతడిని పరారీలో ఉన్నట్లు కోర్టు ప్రకటించిందని పోలీసు అధికారి తెలిపారు. షేక్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ..అతని లొకేషన్‌ను ట్రేస్ చేయగా అతను థానే రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అతడిని పట్టుకునేందుకు పోలీసులు ఉచ్చు బిగించి థానే రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశారు.

తమిళనాడులో లారీని ఢీ కొట్టిన బస్సు

తమిళనాడులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ బస్సు అతివేగంతో దూసుకొచ్చి లారీని ఢీ కొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్థం అయిపోయింది. అయితే, ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. 12మంది గాయాలతో బయటపడ్డారు.  తమిళనాడులోని తిరువెక్కాడు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మధురైనుంచి వస్తున్న లారీని కర్నాటకకు చెంది బస్సు  ఢీకొట్టింది. దీంతో వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ప్రయాణికులు దిగి పరిగెత్తారు. ప్రాణాలు దక్కించుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణం అంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

తలకాయపై తుపాకీ పెట్టి మరీ కాల్చాడు

దేశంలో గన్ కల్చర్ విస్తృతంగా పెరుగుతోంది. అందునా నేర ప్రవృత్తి పెరుగుతున్న ఈ రోజుల్లో.. ఎవరి మీద ఎవరు? ఎప్పుడు? ఎందుకు? దాడి చేస్తున్నారో అంతుపట్టడం లేదు. చిన్న చిన్న కారణాలకే దారుణాలకు తెగిస్తున్నారు. తాజాగా అలాంటి దారుణం ఒకటి ఢిల్లీలో వెలుగు చూసింది. వివాహితో పరిచయం ఉన్న ఓ వ్యక్తి.. సడెన్‌గా బాధితురాలి ఇంటికొచ్చి.. ఆమెను గన్‌ పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్చిచంపారు. అనంతరం కాసేపటికే అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలోని డబ్రీ ప్రాంతంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు రేణు గోయల్‌.. భర్త, పిల్లలతో కలిసి డబ్రీ ప్రాంతంలో నివసిస్తోంది. ఆమె జిమ్‌కు వెళ్తుండేవారు. ఈ క్రమంలో ఆమెకు అదే ప్రాంతంలో నివాసముండే ఆశిష్ అనే 23 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంలో వారి మధ్య ఏం జరిగిందో కానీ, ఆశీష్‌ దారుణానికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి రేణు ఇంటికి వెళ్లిన నిందితుడు.. ఆమె తలపై పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో గన్ పెట్టి కాల్చి చంపాడు. అనంతరం అ‍క్కడ నుండి పరారయ్యాడు.

భర్తను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన భార్య

కొందరు క్షణికావేశంలో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా దారుణంగా ప్రవర్తిస్తుంటారు.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.. ఇక ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.. అయిన అక్కడ క్రైమ్ రేటు తగ్గలేదు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. ఓ భార్య తన భర్తను అతి కిరాతకంగా గొడ్డలి తో నరికి చంపింది.. ఆ తర్వాత ఐదు ముక్కలుగా చేసింది.. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. అక్రమ సంబంధమే కారణమని పోలీసులు తెలిపారు.ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఠాణా గజ్రౌలా పరిధిలోని శివనగర్ గ్రామంలో ఓ మహిళ తన భర్తను మంచానికి కట్టేసి గొడ్డలితో తల నరికి చంపింది. అంతేకాదు మృతదేహాన్ని 5 ముక్కలుగా నరికి సమీపంలోని కాలువలో పడేశాడు. డైవర్ల సాయంతో కాల్వలో మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ తన నేరాన్ని అంగీకరించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా భయాందోళనలకు గురవుతోంద మంగళవారం ఉదయం నుంచి 55 ఏళ్ల రాంపాల్ కనిపించకుండా పోయినట్లు సమాచారం. రాంపాల్, అతని భార్య దులారో దేవి మధ్య తరచూ గొడవలు జరిగేవి. నివేదికల ప్రకారం, దులారో దేవి తన భర్త రాంపాల్ స్నేహితుడితో స్నేహం చేసింది. కొన్ని రోజుల క్రితం ఆ మహిళ అతని దగ్గరే నివాసం ప్రారంభించింది. నెల రోజుల క్రితమే ఆమె గ్రామానికి తిరిగి వచ్చినట్లు సమాచారం.

కెనడాలో హత్యకు గురైన భారతీయ విద్యార్థి

 కెనడాలో భారతీయ విద్యర్థి గుర్విందర్ నాథ్ జూలై 14న కారు దొంగల చేతిలో హత్య చేయబడ్డాడు. కాగా ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుమారుడి మృతికి సంబంధించిన విషయాన్ని తల్లికి చెప్పకుండా.. ఉంచారు. కాగా ఈ రోజు మృతదేహం భారతదేశానికి తీసుకొస్తున్న క్రమంలో కుమారుడు మృతి చెందినట్లు ఆమెకు చెప్పారు. దీంతో ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిన ఆమె.. కొడుకు వార్తను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో పంజాబ్ రాష్ట్రంలోని షాహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలో విషాద చాయలు అలుముకున్నాయి. కాగా ఈ రోజు సాయంత్రం వరకు గుర్విందర్ నాథ్ మృతదేహం పంజాబ్ చేరుకోనుందని అధికారులు తెలిపారు.

అమర్​నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుల్డాణాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబయి-నాగ్​పుర్ హైవేపై ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రయాణికులతో వెళ్తున్న రెండు ట్రావెల్ బస్సులు పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సులు నుజ్జునుజ్జయ్యాయి.గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రెండు బస్సుల్లో ఓ బస్సు అమర్​నాథ్ యాత్రికులతో వెళ్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. డ్రైవర్లు నిద్ర మత్తులో ఉండటం వలనో లేక అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.