Devotional

ఈ వారం మీ రాశి ఫలితాలు

ఈ వారం మీ రాశి ఫలితాలు

హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 (30-07-2023 నుండి 05-08-2023) ✍🏻
🗓 ఈ వారం మీ రాశి ఫలితాలు

🐐 మేషం (30-07-2023 నుండి 05-08-2023)

ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యాపారాలలో కూడా స్థిరమైన లాభాలు అందు కుంటారు. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా చేసే ప్రయాణాలు లాభిస్తాయి. ఆశించిన ప్రయోజనాలు నెరవేరు తాయి. ఆచితూచి అడుగులు వేస్తే, ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. సాధారణంగా ఇంటా బయటా మీ మాటకు తిరుగుండదు. ఆర్థిక పరిస్థితి ఢోకా ఉండదు. ఆరోగ్య భంగం కూడా ఉండకపోవచ్చు. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీ నుంచి కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జీవితానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, మంచి ప్లాన్లు వేసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సఫలం కావాలన్న పక్షంలో ఏవైనా మొక్కుబడులు ఉంటే తీర్చుకోవాల్సి ఉంటుంది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం (30-07-2023 నుండి 05-08-2023)

ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఎటువంటి ప్రయత్నం అయినా సఫలం అయ్యే అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కాలక్షేపం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు తిరుగుండదు. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. మీ ఆలోచనలను, నిర్ణయాలను కార్యరూపంలో పెట్టడం మంచిది. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందే సూచన లున్నాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఐ.టి నిపుణులకు, టెక్నాలజీ రంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. తరచూ గణేశుడి స్తోత్రం చదువుకోవడం వల్ల ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం (30-07-2023 నుండి 05-08-2023)

వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం ఉంటాయి. ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులు జీవితంలో స్థిరపడతారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యక్తి గత సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. కొందరు బంధువులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. పిల్లలు చదువుల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజన కంగా ఉంటుంది. శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. కొత్త ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. తరచూ శివార్చన చేయించడం వల్ల ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం (30-07-2023 నుండి 05-08-2023)

తోబుట్టువులతో గానీ, దగ్గర బంధువులతో కానీ ఆస్తి సంబంధమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన ఆస్తి వ్యవహారాలను ముందుగానే చక్కబెట్టుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. రుణగ్రస్తుల నుంచి డబ్బు వసూలు అవుతుంది. స్నేహితుల కారణంగా కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. ఆహార, విహారాల్లో అప్రమత్తంగా ఉండా ల్సిన అవసరం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాలు సాధారణ లాభాలను ఆర్జిస్తాయి. కీలక వ్యవహారాల్లో శ్రమకు తగ్గిన ఫలితం ఉంటుంది. బంధుమిత్రులతో సఖ్యత మరింతగా పెరుగుతుంది. వాహన ప్రయాణాలలో నిర్లక్ష్యం పనికి రాదు. కుటుంబపరంగా బరువు బాధ్యతలు పెరిగి ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామికి పురోగతి ఉంటుంది. తరచూ లలితా సహస్ర నామం పారాయణం చేయడం వల్ల వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం (30-07-2023 నుండి 05-08-2023)

ఉద్యోగులకు పని ఒత్తిడి అధికం అయ్యే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలను,కార్య కలాపాలను నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో బంధువులను జోక్యం చేసుకోనివ్వకపోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు బయటపడ తారు. నిరుద్యోగులు తమకు అందిన ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవ సరం ఉంది. ముఖ్యమైన వ్యక్తిగత విషయాలలో తొందరపాటు నిర్ణయాలు పనికి రావు. కొద్దిగా ఆలస్యం అయినా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇతరులకు వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం శ్రేయస్కరం కాదు. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం పనులు త్వరగా పూర్తి అవుతాయి.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య (30-07-2023 నుండి 05-08-2023)

అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండి, రుణ సమస్యలను వీలైనంతగా తగ్గించుకుంటారు. రావలసిన డబ్బును గట్టి ప్రయత్నంతో వసూలు చేస్తారు. గృహ, వాహన ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. అవరోధాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మధ్య మధ్య వినాయకుడిని పూజిస్తే ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు, అవివాహితుల పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. స్నేహితుల వల్ల డబ్బు నష్టపోవడం గానీ, అవమానాల పాలు కావడం గానీ జరిగే అవకాశం ఉంది. తరచూ శివాలయానికి వెళ్లడం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి.
💃💃💃💃💃💃💃

⚖ తుల (30-07-2023 నుండి 05-08-2023)

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కీలక వ్యవహారాలు పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. అన్ని రంగాలవారికి ధనలాభం ఉంటుంది. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలకు, అవకాశాలకు ఢోకా ఉండదు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల అభివృద్ధికి సంబం ధించి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలకు, వినోద యాత్రలకు ప్లాన్ చేస్తారు. బంధువుల తోడ్పాటుతో పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది. సుబ్రహ్యణ్యస్వామికి ప్రార్థన చేయడం వల్ల మంచి జరుగుతుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం (30-07-2023 నుండి 05-08-2023)

ఆర్థిక పరిస్థితి కొద్ది కొద్దిగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన అవసరాలకు డబ్బు అందుతుంది. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ ఆలస్యం అవుతుంటుంది. పట్టుదలగా వ్యవహరిస్తే పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. నిరుద్యోగులు తమకు అంది వచ్చిన అవ కాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సమస్యలు తలెత్తకుండా చూసుకో వాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. గృహ, వాహన సంబంధమైన సమస్యలు మరి కొంత కాలం కొనసాగుతాయి. వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. నష్టాల నుంచి లేదా ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్ల నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రాంతంలో స్థిరపడిన పిల్లలు ఇంటికి వచ్చే సూచనలు ఉన్నాయి. ఇతరుల విమర్శలను లెక్కచేయవద్దు. దుర్గాదేవి స్తోత్రం చేయడం ప్రస్తుతం మీకు చాలా మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు (30-07-2023 నుండి 05-08-2023)

ఆస్తి వివాదాలు చాలావరకు ఒక కొలిక్కి వస్తాయి. పెద్దల జోక్యంతో ఇవి త్వరలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరిగి, లాభసాటిగా కొనసాగుతాయి. తలపెట్టిన పనులన్నీసంతృప్తికరంగా పూర్త వుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పలుకుబడి పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు పెంపొందుతాయి. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడండి. వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. పిల్లల వల్ల సంతోషం అనుభవిస్తారు. సుందరకాండ పారాయణం చేయడం వల్ల మంచి జరుగుతుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం (30-07-2023 నుండి 05-08-2023)

వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన వాతావరణం ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం కల్పిస్తుంది. అధికారుల నుంచి మీ పని తీరుకు గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాలు నిర్వహి స్తారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. శత్రు,రోగ, రుణ సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. లాభాలు పెరుగుతాయి. ధనాదాయం బాగుంటుంది. ఏ విషయంలోనూ తొందరపాటుతో వ్యవహరించవద్దు. కొన్ని వ్యక్తిగత సమస్యలు నెమ్మది మీద సర్దుకునే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామికి ప్రమేయం కల్పించడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. పిల్లలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. శివార్చన చేస్తే శుభఫలితాలుంటాయి.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం (30-07-2023 నుండి 05-08-2023)

ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు స్థిరంగా కొనసాగుతాయి. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చు. పిల్లలకు సంబంధించి ఇరుగుపొరుగుతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బంధుమిత్రుల నుంచి ముఖ్యమై వ్యవహారాల్లో సహాయ సహకారాలు అందుతాయి. సోదర వర్గంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగా లలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. పని భారం ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలాలు, ప్రోత్సాహకాలు కూడా అందుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడవచ్చు. కుటుంబ పెద్దల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లే సూచనలున్నాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. శివార్చన వల్ల ప్రయత్నాలు సఫలం అవుతాయి.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం (30-07-2023 నుండి 05-08-2023)

ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలతో కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ, ఇంటి మరమ్మతుల మీదా, పునర్నిర్మాణ పనుల మీదా బాగా ఖర్చు చేస్తారు. వృత్తి జీవి తంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలలో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పలుకుబడి పెరుగుతుంది. బంధువులతో ఆస్తి వివాదాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. దూర ప్రాంతంలో ఉన్న పరిచయస్థులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శత్రు, రోగ, రుణ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.
🦈🦈🦈🦈🦈🦈🦈