Health

డెంగ్యూ జ్వరానికి చెక్ పెట్టేందుకు ఈ యోగాసనాలను ప్రయత్నించండి

డెంగ్యూ జ్వరానికి చెక్ పెట్టేందుకు ఈ యోగాసనాలను ప్రయత్నించండి

యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆసనాలు వేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శరీరం ధృడంగా ఉండటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, రోజంతా ఉత్సహంగా ఉండటానికి ఆసనాలు ఉపయోగపడతాయి. చాలా మంది శారీరక ఆరోగ్యం కోసం వర్క్ అవుట్ చేస్తుంటారు. అయితే యోగా తో డెంగ్యూ జ్వరానికి కూడా చెక్ పెట్టవచ్చంటున్నారు యోగా నిపుణులు.అయితే కొన్ని యోగసనాలతో మానసిక ప్రశాంతతతో పాటు అనేక రోగాల నయం చేయడానికి ఈ ఆసనాలు ఉపయోగపడతాయి. అయితే యోగా తో డెంగ్యూ జ్వరానికి కూడా చెక్ పెట్టవచ్చంటున్నారు యోగా నిపుణులు. డెంగ్యూ నుంచి కోలుకోవడానికి సహాయపడే యోగా ఆసనాలు ఏమిటో తెలుసుకుందాం.

దండాసనం: కూర్చున్న స్థితిలో కాళ్లను ముందుకు చాపి, మడమలను, కాళ్లను కలపే ప్రయత్నం చేయాలి. వీపును నిటారుగా ఉంచి ముందుకు చూడాలి. వెన్నెముకకు మద్దతుగా నేలపై అరచేతులను తుంటి పక్కన ఉంచాలి. భుజాలను రిలాక్స్​గా ఉంచాలి.

మలాసనం: నిటారుగా నిల్చోవాలి. మోకాళ్లను వంచి, మడమల మీద బరువు వేస్తూ కూర్చోవాలి. పాదాలు నేలపై ఫ్లాట్‌గా ఉండేలా చూసుకోవాలి. మీరు మీ అరచేతులను పాదాల పక్కన నేలపై ఉంచవచ్చు. ఈ స్థితిలో వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.

పశ్చిమోత్తనాసనం: దండసానాతో ప్రారంభించి.. వీపు భాగం గట్టిగా ఉంటే చేతులతో పట్టుకుంటూ పాదాల చుట్టూ ఉంచాలి. మోకాలు కొద్దిగా వంచి.. కాళ్లు ముందుకు సాగేలా చూసుకోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచుతూ ముందుకు వంచాలి. బొటనవేళ్లను వేళ్లతో పట్టుకోవాలి. తలతో మోకాళ్లను తాకాలి.

వజ్రాసనం: నేలపై మోకరిల్లాలి. మీ కటిని మడమల మీద ఉంచి.. మోకాళ్లు, చీలమండలను స్ట్రెచ్ చేయాలి. మడమలను ఒకదానికొకటి దగ్గరగా ఉంచాలి. అరచేతులను మోకాళ్లపై లేదా తొడలపై ఉంచాలి. సౌకర్యవంతంగా ఉండే వరకు కటిని కొద్దిగా వెనుకకు, ముందుకు సర్దుబాటు చేసుకోవాలి.