DailyDose

TS:టెట్ నోటిఫికేషన్ కు ముహూర్తం ఖరారు

TS:టెట్ నోటిఫికేషన్ కు ముహూర్తం ఖరారు

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పరీక్షను సెప్టెంబర్ లో నిర్వహించాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల తేదీ ఇతర ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసి.. సెప్టెంబర్ రెండో వారంలో పరీక్షను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఈ వారంలో ఎప్పుడైనా టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికి తెలంగాణలో మూడు సార్లు మాత్రమే టెట్ నిర్వహించారు. 2016, 2017, 2022లో జూన్ 12న చివరి సారి టెట్ పరీక్ష నిర్వహించారు. ఈ నెల మొదటివారంలో విద్యాశాఖ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో.. ఈ యేడు టెట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్‌ క్వాలిఫై కానీ వారు 2 లక్షల మంది ఉన్నారు. వీరు మాత్రమే కాకుండా కొత్తగా బీఈడీ, డీఎడ్‌ పూర్తిచేసిన వారు 20 వేల మంది ఉన్నారు. తాజాగా విడుదల చేసే టెట్‌ నోటిఫికేషన్ తో వీరందరికి మరోసారి పరీక్ష రాసే అవకాశం దక్కుతుంది.