Fashion

వైకల్యంపై విజయం ఈ గుజరాత్ యువకుని సొంతం

వైకల్యంపై విజయం ఈ గుజరాత్ యువకుని సొంతం

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన స్మిత్‌ చాంగెలా చిన్నప్పటి నుంచీ నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. అలాగని శారీరక వైకల్యాన్ని కారణంగా చూపుతూ ఏ పని చేయకుండా ఖాళీగా ఉండిపోలేదు. సవాళ్లను అధిగమించి సత్తా చాటాడు. మొబైల్‌లో చేత్తో టైప్‌ చేస్తుంటే నొప్పులతో మెలికలు తిరిగిపోయేవాడు. దీంతో కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ముక్కు కొనతో టైపింగ్‌ అభ్యాసం ప్రారంభించాడు. మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించినా.. ఇప్పుడు వేగంగా టైప్‌ చేస్తున్నాడు. ‘‘నిమిషానికి 151 అక్షరాలు/36 పదాలు టైప్‌ చేసి, ’ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌‘ గుర్తింపు పత్రం అందుకొన్నా. నాలాంటి దివ్యాంగ యువత దేశంలో ఎంతోమంది ఉన్నారు. వారు కూడా ఒత్తిడిని అధిగమించి, వినూత్నంగా ఆలోచించి విజయం సాధించాలి’’ అని స్మిత్‌ అంటాడు. బీకాం చదువుతూ యూపీఎస్సీ పరీక్షలకు ఈయన సిద్ధమవుతున్నాడు.