Devotional

అరుణాచలంలో జరుగుతున్న పచ్చి మోసాలు – వాస్తవాలు

అరుణాచలంలో జరుగుతున్న పచ్చి మోసాలు - వాస్తవాలు

ఇటీవలకాలంలో అరుణాచలం పట్ల,
తెలుగు భక్తుల్లో చాలా క్రేజ్ ఏర్పడింది.

ఇదివరలో శ్రీ భగవాన్ రమణ మహర్షి, శ్రీ కావ్యకంఠ గణపతి ముని, శ్రీ బీవీ నరసింహ స్వామి, శ్రీమల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, శ్రీ సామవేదం వారు, శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి సద్గురువులు, మహాత్ముల ప్రవచనాలను విని, ప్రభావితమై, తగు శ్రద్దాభక్తులతో ఆర్తితో అరుణాచలం వచ్చేవారు.

కానీ, ఇప్పుడలా కాదు.
కూటికోసం కోటి విద్యలన్నట్లు,
నాలుగు చిల్లర డబ్బుల కోసం, వ్యూస్ కోసం, యూట్యూబ్ ద్వారా వచ్చే ధనం కోసం ఇలా ఎవరంటే వారు మిడిమిడి జ్ఞానంతో, అక్కడ అదుంది, ఇక్కడ ఇదుంది అని ఆసక్తి గొలిపేలా, అమాయక భక్తులను దారితప్పించేలా, తికమక పెట్టేలా బోధిస్తూ, వీడియోలు చేస్తూ, ఒకానొక గంధరగోళాన్ని సృష్టిస్తూ వాళ్ళ పబ్బాన్ని గడుపుకుంటున్నారు.

అది చాలదన్నట్లు, కేవలం పగటి వేషగాళ్ళలా, ఒళ్ళంతా రుద్రాక్షలు ధరించి, త్రిశూలాలు చేతపట్టుకుని అరుణాచలంలో కలతిరుగుతూ, అన్నదానాల పేరిట, భూదానాల పేరిట, పూజల పేరిట, అభిషేకాల పేరిట, ఛారిటబుల్ ట్రస్టుల పేరిట అడుగడుగునా డబ్బులు గుంజుతూ, వారికి వారే వాళ్ళ వ్యక్తిగత అనుచరులతో తగు పబ్లిసిటీని ఇప్పించుకుంటూ, భక్తిపేరుతో, ఆధ్యాత్మికత పేరుతో తగు ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు.

ఆస్తిక మహాశయులారా,
దయచేసి గమనించండి. ఇటువంటి దౌర్భాగ్యులను, మోసగాళ్ళను ఆదిలోనే అరికట్టండి.

ఇక్కడ ఎవరు ఎవరికీ #బోధించాల్సిన పనిలేదు.
తగు మార్గనిర్దేశం చేసి, #ఉద్దరించాల్సిన పని అంతకంటే లేదు.

#అరుణాచలం సాక్షాత్తు #పరమేశ్వర_స్వరూపం. గిరిప్రదక్షిణం #సర్వాభీష్ట ఫలప్రదం.

కావున, మీకు మీరుగా రండి. మీ తప్పులను, అవసరతలను పరమేశ్వరునికి విన్నవించి, పరిపూర్ణమైన విశ్వాసంతో ఈశ్వరుని ముందు సాష్టాంగ నమస్కారాన్ని ఆచరించి, తగు భక్తిశ్రద్దలతో, ఆర్తితో, #అరుణాచలశివ నామ స్మరణతో తగు మౌనంగా #గిరిప్రదక్షిణం గావించి వెళ్ళండి, చాలు.

తప్పక ఈశ్వరానుగ్రహం సిద్ధించి, మీరు, మీ #జీవితాలు నిస్సందేహంగా ఉద్దరింపబడతాయి.

#అరుణాచలశివ.
అరుణాచల శివ.🙏🙏