పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు, మనము ఎక్కడ ఉంటే అక్కడే పండుగ అంటూ చాటిచెప్పే మల్టీఫెస్ట్ వేడుకలను కెనడాలోని హాలిఫాక్స్‌లో నిర్వహించారు.
ఈ “నోవా మల్టీఫెస్ట్” సంబరాలలో ప్రవాస భారతీయులు, తెలుగువారు కలిసి భారతీయ పండుగలు (ఉగాది,- తెలుగు కొత్త సంవత్సరం, కర్వా చౌత్(అట్ల తదియ), రాఖీ -రక్షాబంధన్, తెలుగు పండుగ సంక్రాంతి(ముగ్గులు, గాలిపటాలు, ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యం); మరియు దీపావళి( దీపాల వరుస,ఆనందం, విజయం, సామరస్యానికి గుర్తుగా జరుపుకునే పండుగలు) ప్రాముఖ్యతను అతిథులకు వివరించారు. 8000మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
భరతనాట్యం(జనని కృష్ణ్ణ), కూచిపూడి (జ్యోత్స్న శ్రీజ చల్లా), కర్రసాము(శిబి నాన్తం ఆట్రియం), జానపద నృత్యాలతో (దీపీకా కర్ణం,జయశ్రీ కర్ణం ) అతిథులను అలరించాయి. పలు దేశాల విందు భోజనాలు ఆకట్టుకున్నాయి. సుప్రజ, విశాల్ భరద్వాజ్, భ్యారి, టీనా, సెలెస్ట్, కెనడా NS లీడర్ పార్టీ ప్రతినిధి, యార్మౌత్ MLA జాక్ చర్చిల్, NDP లీడర్ క్లాజుడై చందర్, క్లేటొన్ పార్క్ MLA రఫా డీకోస్తాంజో, శ్రీహరి చల్లా, ఫణి వంక, శివ మారెళ్ళ, చంద్రా తాడేపల్లి, వెంకట్ వేలూరి, శ్రీనివాస చిన్ని, పృద్వి కాకూరు, కృష్ణవేణి, రత్నం, జయ, ప్రియాంక, లావణ్య, శ్రీలేఖ, సియ శ్రీశివకుమార్, రిషిన్త్ శివకుమార్, రోహిత్ సాయి చల్లా తదితరులు పాల్గొన్నారు.