జగన్ పాలనలో రాష్ట్రంలో సాగునీటి రంగానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడానికి తెదేపా అధినేత చంద్రబాబు మంగళవారం నుంచి పది రోజుల పాటు ప్రాజెక్టుల సందర్శనకు శ్రీకారం చుట్టనున్నారు. పెన్నా నుంచి నాగావళి వరకు వివిధ నదులపై ఉన్న ప్రాజెక్టులను పరిశీలించి.. వైకాపా ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడతారని ఆ పార్టీ పేర్కొంది. తొలి అయిదు రోజుల పర్యటన వివరాలను విడుదల చేసింది.
బీ ఆగస్టు 1న నంద్యాల జిల్లా నందికొట్కూరులో రోడ్‌షో, సభ నిర్వహిస్తారు. అనంతరం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌ను సందర్శిస్తారు.
- 2న జమ్మలమడుగు, పులివెందులలో పర్యటిస్తారు. కొండాపురం మండలం గండికోట ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకాల్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్లనున్న చంద్రబాబు స్థానిక పూలంగళ్ల సర్కిల్ వద్ద రోడ్‌షో, బహిరంగసభ నిర్వహిస్తారు.
- 3న కదిరి, అనంతపురంలో పర్యటిస్తారు. పేరూరు ఇరిగేషన్ ప్రాజెక్టు, గొల్లపల్లి రిజర్వాయర్‌లను సందర్శిస్తారు.
- 4న చిత్తూరు జిల్లాలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌ను పరిశీలిస్తారు. రైతులతో సమావేశమవుతారు. పూతలపట్టులో రోడ్‌షోనిర్వహిస్తారు.
5న తిరుపతిలోని బాలాజీ రిజర్వాయర్‌ను సందర్శిస్తారు. ఆ రోజు సాయంత్రానికి నెల్లూరు చేరుకుంటారు. అక్కడే తెదేపా క్రియాశీల కార్యకర్తలతో సమావేశమవుతారు.