అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.గైనస్విల్లేలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. మరోవైపు ఇండియానాలోని మున్సీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంటకు ఓ పార్టీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, సుమారు 19 మంది గాయపడ్డారు. మిషిగన్‌లోని లాన్సింగ్లోనూ అదే సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో అయిదుగురు గాయపడ్డారు.
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
